ఇండియా స్పేస్‌ స్టేషన్‌ దిశగా అడుగులు

న్యూఢల్లీి, అక్టోబరు 18
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఎూఖీూ) చారిత్రాత్మక ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ మానవసహిత అంతరిక్ష నౌక మిషన్‌ కోసం మానవరహిత అంతరిక్ష ప్రయోగ పరీక్ష నౌకను (టీవీ`డీ1 టెస్ట్‌ ఫ్లయిట్‌) అక్టోబర్‌ 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. టెస్ట్‌ మాడ్యూల్‌కు సంబంధించిన ఫోటోలను కూడా ఇస్రో పంచుకుంది. గగన్‌యాన్‌ మిషన్‌ సన్నాహాలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో.. కీలక మిషన్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గగన్‌యాన్‌ మిషన్‌ సంసిద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవిూక్షించి పలు సూచనలు చేశారు.భారతదేశ గగన్‌యాన్‌ మిషన్‌ పురోగతిని అంచనా వేయడానికి.. భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తును నిర్ధారించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అంతరిక్ష శాఖ గగన్‌యాన్‌ మిషన్‌కు సంబంధించిన అన్ని వివరాలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆరాతీశారు. ఇందులో మానవ`రేటెడ్‌ ప్రయోగ వాహనాలు, సిస్టమ్‌ అర్హత వంటి వివిధ సాంకేతికతలు ఉన్నాయి. హ్యూమన్‌ రేటెడ్‌ లాంచ్‌ వెహికల్‌ (ఊఒపఓ3) 3 అన్‌క్రూడ్‌ మిషన్‌లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలను ప్రణాళికలతో నిర్వహించనున్నారు. క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ టెస్ట్‌ వెహికల్‌ మొదటి ప్రయోగం అక్టోబర్‌ 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశం మిషన్‌ సంసిద్ధతను అంచనా వేయనుంది. 2025లో దాని ప్రయోగాన్ని ధృవీకరించనుంది.ఇటీవలి చంద్రయాన్‌`3, ఆదిత్య ఒ1 మిషన్‌లతో సహా భారత అంతరిక్ష కార్యక్రమాలు విజయవంతమైన నేపథ్యంలో 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష స్టేషన్‌’ ఏర్పాటుతో సహా కొత్త, ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను భారతదేశం ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధానమంత్రి మోదీ శాస్త్రవేత్తలను ఆదేశించారు. 2040 నాటికి చంద్రునిపైకి మొదటి భారతీయుడిని పంపడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మిషన్లను భారత్‌ శుక్రుడు, అంగారక గ్రహంపైకి చేపట్టనుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *