అప్పుడే సీఎం పోస్టు కోసం పోటీ

హైదరాబాద్‌, జూలై 1
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌?పార్టీకి వేవ్‌? వచ్చింది.దీంతో పార్టీలోని కొందరు నాయకులు ఇప్పట్నుంచే పదవులపై కన్నేశారు. ఏకంగా సీఎం పోస్టుపై పోటీ పెరిగింది. తమ సామాజిక వర్గానికి ఇవ్వండని ఒకరు.. మాకే కావాలంటూ ఇంకొందరు లీడర్లు ఢల్లీిలోని హై కమాండ్‌కు ప్రపోజల్స్‌ పెట్టినట్లు సమాచారం. ఇటీవల ఏఐసీసీ విూటింగ్‌ తర్వాత పలువురు నేతలు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీకి రిక్వెస్టు లెటర్లను పంపినట్లు తెలిసింది.ఇందులో బీసీలకు ఇవ్వాలని కొందరు.. దళితులకే ఇవ్వాలని మరికొందరు.. రెడ్డిలకు ఇస్తే పార్టీ మెరుగుపడుతుందని ఇంకొందరు సోనియాకు పంపిన లేఖల్లో కోరినట్లు సమాచారం. అయితే ఈ లెటర్స్‌పై సోనియా ఘాటుగానే రిప్లయ్‌ ఇచ్చారు. ముందు అందరూ సమిష్టిగా పార్టీని గెలిపించాలని, పార్టీ నియమ నిబంధనల ప్రకారం పోస్టులు తప్పకుండా వస్తాయని రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్‌?నేతతో చెప్పినట్లు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్నది.రాష్ట్రంలో ఎన్నికలే కాలేదు.. కాంగ్రెస్‌?పవర్‌లోకి రాకముందే కేబినెట్‌ కూర్పుపై గాంధీభవన్‌లో చర్చ మొదలైంది. తాము ఈసారి ఫలానా శాఖ తీసుకుంటామని కొందరు సీనియర్లు అడ్వాన్స్‌గా అనుచరులతో చెప్పుకుంటున్నారు. మంత్రి మండలిలో తమకు కూడా అవకాశం కల్పించాలని మరికొందరు నేతలు టీపీసీసీ పెద్దలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి హైకమాండ్‌ వరకు వెళ్లింది. తెలంగాణలో పార్టీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని, అప్పటి వరకు పదవులు గురించి ప్రస్తావించవద్దని ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు టర్మ్‌లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌?పార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల్లో కాంగ్రెస్‌కు మద్దతు పెరగడంతో నేతల్లో ఆటోమెటిక్‌గా ఇప్పట్నుంచే ఆశలు మొదలయ్యాయి.సీనియర్లంతా పదవులపై చర్చించుకోవడం గమనార్హం. పైగా పార్టీ నిర్వహించిన ఇంటర్నల్‌?సర్వేల్లోనూ పాజిటివ్‌ రిపోర్టు రావడంతో ఇప్పుడు నేతలంతా నూతనోత్సాహంతో పనిచేస్తున్నారు. హై కమాండ్‌ దృష్టిలో పడేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. రాహుల్‌?గాంధీ, రేవంత్‌ రెడ్డి మార్కులు పొందేందుకు చాలా మంది లీడర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *