ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది

ఇటీవల థియేటర్స్‌లో విడుదలై సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఐఎంబీడీలో 9.4, బుక్‌ మై షో రేటింగ్‌ 9.1 రేటింగ్‌ సాధించిన ‘చక్రవ్యూహం’ (Chakravyuham-The Trap) ఓటీటీలో సందడి చేస్తోంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో విజయవంతంగా స్ర్టీమింగ్‌ అవుతోంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో అలరించిన అజయ్‌ (Ajay) పోలీస్‌ ఆఫీసర్‌గా మెప్పించిన చక్రవ్యూహం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే! 1.74 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం కథ, కథనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అజయ్‌తోపాటు వివేక్‌ త్రివేది, ఊర్వశి పరదేశి, జ్ఞానేశ్వరి కండ్రేగుల ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. చెట్కూరి మధుసూదన్‌ రచన దర్శకత్వంలో శ్రీమతి సావిత్రి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.

కథ విషయానికి వస్తే అనాధ అయిన సంజయ్‌(వివేక్‌ త్రివేది) శరత్‌(సుదేశ్‌) ఇద్దరూ మంచి ేస్నహితులు. శరత్‌ ద్వారా పరిచయమైన సిరి (ఊర్వశి పరదేశి) సంజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇక శరత్‌, సంజయ్‌ లిద్దరూ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ను ప్రారంభిస్తారు. అంతా సవ్యంగానే ఉంది అన్న తరుణంలో… సంజయ్‌ భార్య సిరి హత్యకు గురి అవ్వడంతో కథలో కీలక మలుపే చోటుచేసుకుంటుంది. కథ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో శరత్‌ కూడా హత్యకు గురి అవుతాడు. ఎవరు ఊహించని సస్పెన్స్‌ సన్నివేశాలతో ఈ రెండు హత్యలు వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో ‘చక్రవ్యూహం’ ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతోంది. ఈ మిస్టరీని పోలీస్‌ ఆఫీసర్‌గా అజయ్‌ ఎలా ఛేదించాడనే ‘చక్రవ్యూహం’ కథ. జూన్‌ 2న థియేటర్లో విడుదలైన చక్రవ్యూహం చిత్రం ఈ నెల 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *