అమ్మకానికి మరిన్ని భూములు

హైదరాబాద్‌, ఆగస్టు 10
హైదరాబాద్‌ పరిధిలోని స్థలాల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 16వ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తుంది. 18వ తేదీన ఈ`వేలం నిర్వహించనుంది. హైదరాబాద్‌ పరిధిలో మరోసారి భూముల ఈ`వేలానికి హెచ్‌ఎండీఏ రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌`మల్కాజ్‌ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల అమ్మకానికి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, పీరంచెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్‌, చందానగర్‌ లో హెచ్‌ఎండీఏ స్థలాలు విక్రయించనున్నారు. మేడ్చల్‌`మల్కాజ్‌గిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం, సంగారెడ్డిలో వెలిమల, నందిగామ, అవిూన్‌పూర్‌,రామేశ్వరం బండ, పతిఘనపూర్‌, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని స్థలాలు విక్రయించనున్నారు. ఈ ప్రాంతాల్లో రామేశ్వరం బండ, నందిగామలో చదరపు గజానికి కనీస ధర రూ.12వేలు, కోకాపేట, నల్లగండ్లలో గరిష్ఠంగా రూ.65 వేలుగా నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో ప్లాట్ల విస్తీర్ణం 302 చదరపు గజాల నుంచి 8,591 చదరపు గజాల వరకు ఉన్నాయి. ఈ`వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్‌ఎండీఏ తెలిపింది. రిజిస్ట్రేషన్‌ కు చివరి తేదీ ఆగస్టు 16 కాగా, ఈ నెల 18 నుంచి ఈ`వేలం నిర్వహించనున్నారు.
ఈ`వేలం షెడ్యూల్‌
రిజిస్ట్రేషన్‌ కు చివరి తేదీ ` 16`08`2023, సాయంత్రం 5 గంటల వరకు
రిజిస్ట్రేషన్‌ ఫీజు ` రూ.1180( నాన్‌ రిఫండబుల్‌)
డిపాజిట్‌ మనీ(ఈఎండీ) ` రూ.5,00, 000
ఈఎండీ చివరి తేదీ` 17`08`2023 సాయంత్రం 5 గంటలల వరకు
ఈ`వేలం ` ఆగస్టు 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 2 వరకు రంగారెడ్డి, మేడ్చల్‌`మల్కాజ్‌ గిరి స్థలాల విక్రయం, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు సంగారెడ్డి జిల్లాలో భూముల విక్రయం
హెచ్‌ఎండీఏకు భారీ ఆదాయం
మోకిల భూముల వేలంలో హెచ్‌ఎండీఏకు భారీ ఆదాయం లభించింది. చదరపు గజానికి గరిష్ఠ ధర లభించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 50 ప్లాట్ల వేలంతో రూ.121.40 కోట్ల ఆదాయం లభించింది. త్వరలో ఫేజ్‌`2 వేలానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. కోకాపేట భూముల వేలంతో రికార్డు స్థాయి ఆదాయం లభించిన విషయం మరుక ముందే మరో లేఔట్‌లో హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం లభించింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు సవిూపంలోని మోకిల లేఅవుట్‌లోని ప్లాట్ల ఈ`వేలానికి ఊహించిన దాని కంటే అధికంగా స్పందన లభించింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వేలంలో మోకిలా ప్లాట్లు చకచకా అమ్ముడయ్యాయి. సోమవారం ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో 50 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించారు. చదరపు గజానికి గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ధర పలికింది. ఈ ప్రాంతంలో గజానికి కనీస ధర రూ.72 వేలకు విక్రయించారు. 50 ప్లాట్లకు సరాసరి చదరపు గజం ధర రూ.80,397 చొప్పున ధర పలికింది.
కోకాపేట విక్రయాలకు సాగేనా
కోకాపేట్‌ తరహాలోనే వందల కోట్లు విలువచేసే భూమి కోసం బడా కంపెనీలు కాసుకొని కుర్చున్నాయి. కోకాపేట తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా అత్యంత విలువైన బుద్వేల్‌ భూముల వేలానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. కానీ చివరి నిముషంలో ఈ భూముల వేలాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు కావడంతో ఈ వేలం పై సస్పెన్స్‌ నెలకొంది.రాజేంద్ర నగర్‌ లోని బుద్వేల్‌?లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన 100 ఎకరాల్లో 14 భారీ ప్లాట్లను హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేసింది. ఎకరం భూమి కనీస నిర్దేశిత ధర 20 కోట్లుగా నిర్ణయించింది. ఈ లెక్కన 100 ఏకరాలకు 2000 కోట్లు అవుతుంది. అవి రెట్టింపు ధరలు పలికినా.. 4వేల కోట్ల రూపాయల భారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. కోకపేట తరహాలో అప్‌ సెట్‌ ప్రైస్‌ కంటే మూడిరతలు ధర పలికితే.., ఆదాయం 5 వేల కోట్లకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. బుద్వేల్‌ భూముల వివాదంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆ ల్యాండ్‌ ను హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు గతంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపినట్లు బార్‌ అసోసియేషన్‌ చెబుతుంది. 100 ఏకరాలను హైకోర్టు భవనాల కోసం కేటాయించేలా ప్రస్తుత వేలాన్ని ఆపాలంటూ బార్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ పై బుధవారం కోర్టులో లిస్టింగ్‌ కానీ, ప్రస్తావన కానీ రాలేదు. వేలం జరిగే గురువారం రోజు ఉదయమే ప్రస్తావన వస్తే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ బిడ్డర్లలో నెలకొంది. ూఖీఖీను ఆనుకోని రాజేంద్ర నగర్‌ మెయిన్‌ రోడ్డుకు ఉన్న బుద్వేల్‌ ల్యాండ్స్‌ ను వేలంలో దక్కించుకునేందుకు వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అంతే కాకుండా ఎయిర్‌ పోర్టు మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ ఆ మార్గంలో వస్తుండటం బుద్వేల్‌ ప్రైమ్‌ ఏరియాగా మారింది. పక్కనే జంట జలాశయాలు ఉండటం కూడా ఈ లే అవుట్‌ కు మంచి డిమాండ్‌ వచ్చేందుకు కారణం అవుతుంది.ఇక ఇదిలా ఉంటే మూడు జిల్లాల్లో భూముల వేలానికి తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది హెచ్‌ఎండిఏ. రంగారెడ్డి, సంగారెడ్డి., మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాల పరిధిలో 26 ల్యాండ్‌ పార్సిల్స్‌ ను వేలం వేయాలని నిర్ణయించింది. రంగారెడ్డిలో 8 ప్లాట్లు, మెడ్చెల్‌ లో 8 ప్లాట్లు, సంగారెడ్డిలో 10 ఒపెన్‌ ప్లాట్లను హెచ్‌ఎండిఏ రెడీ చేసింది. ఈ ప్లాట్ల వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 16 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 18న రెండు సెషన్స్‌ లో ఆన్‌ లైన్‌ వేలం జరుగనుంది. ఈ మూడు జిల్లాల్లో 300 చదరపు గజాల చిన్న ప్లాట్‌ నుండి 8,590 చదరపు గజాల పెద్ద ప్లాట్ల వరకు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఏరియాను బట్టి అప్‌ సెట్‌ ప్రైస్‌ నిర్ణయించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని నల్లగండ్ల ప్లాట్లకు చదరపు గజానికి 65 వేల రూపాయల అప్‌ సెట్‌ ప్రైస్‌ నిర్ణయించారు. కనిష్ఠంగా సంగారెడ్డిలో 12 వేల రూపాయలు చదరపు గజానికి అప్‌ సెట్‌ ప్రైస్‌ నిర్ణయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *