గులాబీ నేతల…ఛలో అమెరికా

హైదరాబాద్‌, జూలై 1
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూలై మొదటి వారంలో తానా సభలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే పలువురు నేతలకు ఆహ్వానం అందింది. దీన్ని క్యాష్‌ చేసుకోవాలని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లి ఎంజాయ్‌ చేయడంతోపాటు పనిలో పనిగా ఫండ్స్‌ సవిూకరించుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన తమ స్నేహితులను అప్రోచ్‌ అవుతున్నారు. నిధులు ఇచ్చేలా హావిూ తీసుకోవాలని చూస్తున్నారు.రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు జూలై ఫస్ట్‌ వీక్‌లో అమెరికాలో నిర్వహించే తానా సభలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. వారం రోజుల పాటు యూఎస్‌లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ నుంచి పర్మిషన్‌ తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న తానా సభలకు మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంజాయ్‌ చేయడంతో పాటు తమ స్నేహితుల నుంచి ఎన్నికల ఫండిరగ్‌ సేకరించే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.అగస్టు తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే చాన్స్‌ ఉంది. దీంతో ఎన్నికల ప్రచారం మొదలు, రిజల్ట్‌ వచ్చే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి బయటికి వెళ్లడం సాధ్యం కాదు. అందుకని జూలై 3 నుంచి 7 వరకు యూఎస్‌లోని ఫిలడెల్ఫియాలో నిర్వహించే తానా సభలకు వెళ్లి, ఎంజాయ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. వారితో పాటు సెగ్మెంట్‌లో తమకు కీలకమైన ఇద్దరు, ముగ్గురు లీడర్లను వెంట తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌లో అమెరికా వీసాల హడావుడి నెలకొంది.యూఎస్‌ టూర్‌ను కొందరు ఎమ్మెల్యేలు ఎంజాయ్‌తో పాటు ఎలక్షన్‌ ఫండ్‌ రైజింగ్‌ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఎన్నికల ఖర్చు పార్టీ ఎలాగూ ఇస్తుంది. అయితే అప్పటి వరకు సెగ్మెంట్‌లో పర్యటించేందుకు ఫండ్‌ అవసరమని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అక్కడున్న ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేసి బస ఏర్పాట్లతో పాటు ఎన్నికల ఫండిరగ్‌కు సాయం చేయాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *