20 ఏళ్లలో 1000 శాతం పెరిగిన యెల్లో మెటల్‌

ఈ నెల 22న, శనివారం నాడు వచ్చిన అక్షయ తృతీయ ఒక పవిత్రమైన పండుగ. అక్షయ తృతీయ నాడు బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా శుభప్రదంగా హిందువులు భావిస్తారు. ప్రతి ఒక్కరు తమ బడ్జెట్‌కు అనుగుణంగా, కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా అక్షయ తృతీయ నాడు కొనడానికి ప్రయత్నిస్తారు. గత కొన్ని నెలలుగా, బంగారంపై పెట్టుబడి పెట్టిన వాళ్లకు విపరీతమైన రాబడిని తిరిగి వచ్చింది. అయితే, 20 ఏళ్ల క్రితం, అంటే 2003లో అక్షయ తృతీయ నాడు బంగారం ధర ఎంత ఉందో విూకు తెలుసా?2003లో, అక్షయ తృతీయ పండుగను మే నెల 4వ తేదీన జరుపుకున్నారు. ఆ రోజు, 10 గ్రాముల బంగారం ధర రూ. 5,656 గా ఉంది. ఇప్పుడు, 2023లో, అక్షయ తృతీయ పండుగకు ముందే 10 గ్రాముల పసిడి రేటు రూ. 60,560 గా ట్రేడవుతోంది. ఈ 20 ఏళ్లలో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 54,900 పెరిగింది. అంటే, రెండు దశాబ్దాల్లో ఏళ్లలో బంగారం ధర 1000 శాతం లేదా 10 రెట్లు పెరిగింది. 20 ఏళ్ల క్రితం అక్షయ తృతీయ నాడు లక్ష రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే దాని విలువ ఇప్పుడు రూ.10 లక్షల వరకు పెరిగి ఉండేది.బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా ఈ 20 ఏళ్లలో 900 శాతం పెరిగింది. 2003 మే 4వ తేదీన కిలో వెండి రూ. 7,550 వద్ద ట్రేడయింది. ఇప్పుడు, కిలో వెండి రూ. 76,200 వద్ద ఉంది. ఈ రెండు దశాబ్దాల్లో కిలో వెండి ధర రూ. 68,650 మేర పెరిగింది. శాతాల వారీగా చూస్తే.. 20 ఏళ్లలో వెండి ధర 900 శాతానికి పైగా పెరిగింది.20 ఏళ్ల క్రితానికి వెళ్లకుండా, కేవలం ఒక్క సంవత్సరం వెనుదిరిగి చూసినా బంగారం ధర ఆశ్చర్యపరుస్తుంది. 2022లో, అక్షయ తృతీయ నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 50,808గా ఉంది. గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకు బంగారం ధర 19.20 శాతం లేదా 10 గ్రాములకు రూ. 9,760 పెరిగింది. బంగారం ధరల పరుగు ఇప్పుడప్పుడే ఆగదన్నది నిపుణుల అభిప్రాయం. అతి త్వరలోనే 10 గ్రాముల పసిడి ధర 10 గ్రాములకు రూ. 65,000 స్థాయిని తాకవచ్చని అంచనా.ఆభరణాలు, కడ్డీలు, నాణేల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది సాధారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఇష్టపడే మార్గం. కానీ, ఉూు, మేకింగ్‌ ఛార్జీలు వంటివి ఉంటాయి కాబట్టి ఇది ఖర్చుతో కూడుకున్న మార్గం. అంతే కాకుండా, షాపు వాళ్లు మనకు అమ్మే బంగారం స్వచ్ఛత గురించి ఆందోళన కూడా ఉంటుంది. ఇంట్లో కాస్త ఎక్కువ బంగారం ఉందంటే, దొంగల భయంతో సరిగా నిద్ర కూడా పట్టని రోజులివి. ఈ అదనపు ఖర్చు, ఆందోళనలకు విరుగుడుగా… బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఫిజికల్‌ గోల్డ్‌ మాత్రమే కాకుండా ఇతర ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి.. గోల్డ్‌ ఇుఈలు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఉూః), డిజిటల్‌ గోల్డ్‌. స్వచ్ఛత, నిల్వ, ఇతర ఛార్జీల గురించి ఆందోళన చెందకుండా, వీటిలో నిర్భయంగా పెట్టుబడి పెట్టవచ్చు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *