సినీ దర్శకుడు భారతరత్న సత్యజిత్‌ రే జయంతి నేడు

సత్యజిత్‌ రాయ్‌ భారతదేశంలోని బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడిరచాడు. కలకత్తాలో బెంగాలీ కళాకారుల కుటుంబములో మే 2,1921 న జన్మించిన సత్యజిత్‌ రాయ్‌ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్‌ టాగోర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ లోని విశ్వభారతి విద్యాలయము లోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్‌ ప్రారంబించిన రాయ్‌, లండన్‌ లో ఫ్రెంచి నిర్మాత జాన్‌ రెన్వాను కలిసాక, ఇటాలియన్‌ ‘‘నియోరియలిస్టు’’ సినిమా బైసికిల్‌ థీవ్స్‌ తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.రాయ్‌ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్‌ పాంచాలీ, కేన్స్‌ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్‌ ప్లే (కథాగమనము), కేస్టింగ్‌ (నట సారథ్యము), సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్‌ చేసుకోవడము ` వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రాయ్‌ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక ‘‘సందేశ్‌’’ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్‌ 1992 లో ఆస్కార్‌ కూడా అందుకున్నాడు.1992లో, అకాడవిూ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (ఆస్కార్‌) సత్యజిత్‌ రాయ్కి అకాడవిూ గౌరవ పురస్కారం (ఆస్కార్‌ అవార్డు) అందించారు. గౌరవ ఆస్కార్‌ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు.ఏప్రిల్‌ 23 1992కొలకత్తా లో మరణించాడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *