కొంప ముంచిన అతివిశ్వాసం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4
మంచోళ్లమని ప్రచారం చేస్తున్నారా.. చెడ్డోళ్లమని ప్రచారం చేస్తున్నారా అన్నది కాదు ముఖ్యం.. మన గురించి ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారా లేదా అన్నదే రాజకీయ నాయకులకు కీలకం ‘‘ అని బ్రిటిష్‌ మాజీ ప్రధాని విన్‌ స్టన్‌ చర్చిల్‌ చెబుతారు. ఆయన ఈ మాట చెప్పి శతాబ్దాలు అయి ఉండవచ్చు కానీ.., రాజకీయాల్లో ఇప్పటికీ ఇది ప్రధానాంశమే. ఏ విషయంలో అయినా ప్రచారం అతి కాకూడదు. ముఖ్యంగా ప్రత్యర్థికి తామే సొంతంగా ప్రచారం ఇవ్వాలనుకుంటే… దాన్ని పరిమితుల్లోనే ఉంచాలి. లేకపోతే అది ప్లస్‌ అయిపోతుంది. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ తప్పిదం చేసింది. కాంగ్రెస్‌ పార్టీకి మేలు చేసింది. భారీ బహిరంగసభలు పెట్టి కేసీఆర్‌ సహా అగ్రనేతలంతా కాంగ్రెస్‌ కు ప్రచారం చేశారు. భారత రాష్ట్ర సమితి ప్రచార సరళి పూర్తిగా కాంగ్రెస్‌ కేంద్రంగానే సాగింది. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, కవిత ఇలా ఎవరు ప్రచారానికి వెళ్లినా ప్రసంగాల్లో ప్రధానంగా కాంగ్రెస్‌ నే టార్గెట్‌ చేశారు. కాంగ్రెస్‌ కు ఓటు వేయవద్దని వేడుకున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహం ఎలా ఉందంటే.. చివరికి సొంత పార్టీ మేనిఫెస్టో గురించి ఆ పార్టీ నేతలు సభల్లో ఎక్కువగా ప్రచారం చేయలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు భారత రాష్ట్ర సమితి నేతలకు తాము పదేళ్లలో తెలంగాణను బంగారు తునక చేశామన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. అభివృద్ధికి అభివృద్ధి.. సంక్షేమానికి సంక్షేమం .. తమ పాలనలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగనంత జరిగాయని ధీమాతో ఉన్నారు. అదే దిశగా ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత పూర్తిగా పాజిటివ్‌ ఓటుతోనే గెలుస్తామన్న నమ్మకం పోయిందేమో కానీ.. కాంగ్రెస్‌ వస్తే ఏదో జరిగిపోతుందన్న ప్రచారాన్ని ప్రారంభించారు. మొదట్లో కాంగ్రెస్‌ పై విమర్శలకు చాలా తక్కువ సమయం కేటాయించిన ఆ పార్టీ నేతలు.. తర్వాత తర్వాత కాంగ్రెస్‌ ను మాత్రమే టార్గెట్‌ చేసి.. ప్రచారం చేశారు. మూడో సారి అధికారంలోకి రాగానే నాలుగు వందలకే గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చే హావిూ టీఆర్‌ఎస్‌ ఇచ్చిందని పేదలకు తెలియలేదు. కాంగ్రెస్‌ ఐదు వందలకు ఇస్తామన్న హావిూ మాత్రం ప్రజల్లోకి వెళ్లింది. పేపర్లలో ప్రకటనలు.. సోషల్‌ విూడియాలో ప్రచారం తప్ప . బీఆర్‌ఎస్‌ చీఫ్‌ ప్రకటించిన మేనిఫెస్టోలోని హవిూల ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఓటు ప్రాధాన్యాన్ని .. రాజకీయ పార్టీల నిజాయితీని.. కాంగ్రెస్‌ పార్టీ మోసకారి అంటూ ఎప్పుడూ చెప్పుకొచ్చారు. మూడో సారి గెలిస్తే తాము ఏం చేయబోతున్నామో చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపించ లేదు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ ను డీగ్రేడ్‌ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు. మారుతున్న రాజకీయ పరిస్థితికి తగ్గట్లుగా వ్యూహాలను మార్చుకోవడం రాజకీయ నేతల లక్షణం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మారిన పరిస్థితుల్ని బట్టే కేసీఆర్‌ కాంగ్రెస్‌ ను ఎక్కువగా టార్గెట్‌ చేసుకుంటున్నారని అనుకున్నారు. కానీ ఈ విషయం ప్రజల్లోకి మరో విధంగా వెళ్లింది. కాంగ్రెస్‌ గెలవబోతోందని నమ్మబట్టే ఇలా ప్రచారం చేశారని ప్రజలు అనుకున్నారు. చివరికి బీఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం ఎలా మారిందంటే ఇక కాంగ్రెస్‌ గెలవబోతోంది… ప్రజలు ఆ పార్టీకే ఓటు వేయాలని డిసైడ్‌ అయ్యారు.. వారి మనసు మార్చాలన్నట్లుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్‌ కు ఓటు వేస్తే ఏం జరుగుతుందో భయపెట్టే ప్రయత్నం చేశారు. పదేళ్ల పాలనపై వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వానికైనా సహజంగానే ఉంటుంది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఓ ప్రభుత్వపై పౌరుడు అసంతృప్తి పెంచకోవడానికి ఎన్నో కారణాలు ఉండాల్సిన పని లేదు. అలాంటి గండం బీఆర్‌ఎస్‌ కు ఉంది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీ.. ఆరు గ్యారంటీలు.. మేనిఫెస్టో పేరుతో విస్తృతంగా ప్రచారం చేసుకుంది. కాంగ్రెస్‌ గెలిస్తే ఏదో జరిగిపోతుందని బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా ప్రచారం చేయడంపై రాజకీయవర్గాల్లోనే ప్రజల్లో కాంగ్రెస్సే రిజిస్టర్‌ అయింది. ప్రజల చాయిస్‌ కాంగ్రెస్‌ అనే అంశంపై కేసీఆర్‌ కు స్పష్టమైన నివేదికలు వచ్చి ఉంటాయని కాంగ్రెస్‌ వస్తే.. ఏదో జరిగిపోతుందని..కరెంట్‌ ఉండదనే దగ్గర్నుంచి ఐటీ పరిశ్రమలు బెంగళూరు వెళ్లిపోతాయన్న వరకూ అన్ని రకాల ప్రచారాలు చేస్తున్నారని అనుమానించారు. నిజానికి తమ గురించి కూడా పెద్దగా చెప్పుకోకుండా ఎదుటి పార్టీకి ఓటేయవద్దని చేసే ప్రచారం సక్సెస్‌ అయ్యేది చాలా తక్కువ. రిస్క్‌ తీసుకుని బీఆర్‌ఎస్‌ ఇప్పుడు అదే ప్రచారం వ్యూహం పాటించింది. కానీ ఫలితాలు చూస్తే దెబ్బకొట్టిందని అర్థమైపోతుంది. రాజకీయాల్లో పక్క పార్టీ గెలిస్తే అనే మాట తమ నోటి వెంట రాకూడదని రాజకీయ పార్టీల నేతలు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి కేసీఆర్‌ అదే డైలాగ్‌ ను పదే పదే వాడారు. కాంగ్రెస్‌ గెలిస్తే అంటూ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ నేతలు సూపర్‌ కాన్ఫిడెంట్‌ గా… మరోసారి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాదని.. గెలిచే చాన్సే లేదని తమ ప్లస్‌ పాయింట్లను ప్రచారం చేసుకున్నారు. పదేళ్ల వైఫల్యాలు.. .. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం వంటి వాటిపై ప్రచారం చేసశారు. కాంగ్రెస్‌ ప్రచారంలో… బీఆర్‌ఎస్‌ కు హోప్స్‌ ఉన్నాయన్న అభిప్రాయం కల్పించ లేదు. కానీ బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు సైతం… కాంగ్రెస్‌ వస్తే అంటూ మాట్లాడి.. ఆ పార్టీ కే ప్రచాం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో ఇంతో ఇంతో సానుభూతి ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్‌ హయంలో రైతులకు పక్కాగా రుణమాఫీ జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక సంక్షేమ పథకాలు బాగానే అమలయ్యాయి. రేషన్‌ కార్డులు, పించన్లు అడిగిన వారందరికీ ఇచ్చారు. ప్రత్యేకంగా కాంగ్రెస్‌ పై కోపం పెంచుకోవాల్సిన ఘటనలేవిూ లేవు. పైగా తెలంగాణ ఇచ్చి పార్టీ నష్టపోయిందన్న భావనలో కొంత మంది సానుభూతిపరులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విషయంలో ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తే ప్రజలు తమకే ఓట్లేస్తారన్న వ్యూహాన్ని బీఆర్‌ఎస్‌ ఫాలో అయింది. బీఆర్‌ఎస్‌ వ్యూహం రివర్స్‌ అయింది. దానికి ఫలితాలే సాక్ష్యం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *