డ్యూటీకి రాకపోయినా జీతాలు

సర్కిల్‌ ?కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారింది. అధికారుల సమన్వయ లోపంతో ఏ విభాగాన్ని చూసినా అక్రమాలకు కేంద్రాలే జవాబుదారీ తనం లేదు. ఇటీవల జోనల్‌ స్థాయి అధికారి డిప్యూటీ కమిషనర్‌?ను తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెంది పదిరోజులు సెలువుపై వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారంతో తెలిసింది. ఇక పారిశుద్ధ్య విభాగమైతే అడ్డు అదుపులేని వ్యహారంగా నడుస్తుంది. ఎస్‌.ఎఫ్‌.ఏలు జవాన్లు ఆడిరది ఆట పాడిరది పాటగా సాగుతుంది.గ్రూపునకు 7 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా కొన్ని గ్రూపులకు నలుగురు ఐదుగురు కార్మికులే ఉన్నారు. ఎస్‌?ఎఫ్‌?ఏలు డమ్మి కార్మికులను చూపుతూ రబ్బర్‌?వేలు ముద్రలతో కార్మికులందరూ పుల్‌?ఫిల్‌? ఉన్నట్లు చూపుతూ రబ్బర్‌?వేలి ముద్రలతో జీతాలను ఎస్‌?ఎఫ్‌?ఏలు కాజేస్తున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఇక రెండవ రకం కార్మికుడు ఉంటాడు కానీ అతను డ్యూటీ చేయడు ఉదయం మధ్యహ్నం వచ్చి మాత్రం వేలు ముద్ర వేసి పోతాడు.. పని చేయకున్న జీతం మాత్రం బరాబర్‌ తీసుకుంటాడు. అందులో ఎస్‌?ఎఫ్‌?ఏల వాటాలు ఎవరివారికి ఉంటాయి. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కార్మికుడు తెలిపాడు. ఏదో ఒకరోజు చావుకో బ్రతుక్కో డ్యూటీకి రాని రోజు హాజరు వేయడానికి మాత్రం తప్పకుండా రావాలని ఎస్‌?ఎఫ్‌?ఏలు షరతులు పెట్టి పంపిస్తారని తెలిపారు.లేని కార్మికులను ఉన్నట్లుగా చూపి రబ్బర్‌ వేలి ముద్రులు వేసి జీహెచ్‌ఎంసీ నిధులను దండిగా దోచుకుంటున్నారు. ఇందులో ఎస్‌?ఎఫ్‌?ఏలే కీలక పాత్రదారులు, సూత్ర దారులు. ఈ రబ్బర్‌?వేలిముద్రలపై గతంలో జీహెచ్‌ఎంసీ అన్ని సర్కిళ్లలో ఆరోపణలు వచ్చాయి. రెడ్‌?హ్యండెడ్‌?గా దొరికాయి కూడా. అయిన వారిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఆరోపణలు వచ్చినప్పుడు నాలుగు రోజులు గమ్మున ఉండి అంత సద్దుమనిగాక అదే పద్ధతిలో దందా నడిపిస్తారు. వీరిని ఆపే నాథుడే లేడు అంటున్నారు. కొందరు ఎస్‌?ఎఫ్‌?ఏలు అయితే గతంలో నడిచింది ఇప్పుడు ఏమి లేదు అంత రాంకీ వాడు చూసుకుంటుండు అంటూనే అందినకాడి కార్మికులనుండి వసూళ్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో జరిగే అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్‌?అనే ప్రత్యేక విభాగం ఉంది. అది పేరుకు మాత్రమే ఉందికాని ఒక్క అక్రమాన్ని అరికట్టిందిలేదు. అల్వాల్‌?సర్కిల్‌?ను అయితే వారు అసలే పట్టించుకోరంటున్నారు. పారిశుద్ధ్య విభాగంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా విజిలెన్స్‌?అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపడితే అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అల్వాల్‌?వాసులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *