కవిత కోసం కామారెడ్డి….

నిజామాబాద్‌, ఆగస్టు 23
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలోకి దిగితే.. ఆ చుట్టు పక్కల ఉన్న జిల్లాలు.. నిజామాబాద్‌తోపాటు కరీంనగర్‌, ఆదిలాబాద్‌లపై కూడా ఆయన గెలుపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్‌ భావిస్తున్నారు. అలాగే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి మళ్లీ కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత.. పోటీకి దిగితే.. ఆమె గెలుపు నల్లేరు విూద నడకే అవుతోందనే ఓ చర్చ సైతం సదరు పోలిటికల్‌ సర్కిల్‌లో నడుస్తోంది. ఎందుకంటే.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మపూరి అర్వింద్‌ చేతిలో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఈ సారి ధర్మపూరి అర్వింది.. ఎంపీగా లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. అలాంటి వేళ.. ఈ జిల్లాలో కేసీఆర్‌ పోటీ చేస్తే… అతడి విజయాన్నే కాదు.. బీజేపీ ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు అడ్డుకోవచ్చుననే ఓ చర్చ సైతం పోలిటికల్‌ సర్కిల్‌లో నడుస్తోంది. అదీకాక.. దక్షిణ తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగా వేళ్లూనుకొంటొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాల నుంచి బరిలో దిగే కంటే.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కారు పార్టీని షికార్‌ చేయిస్తే.. అది తనకు తన ఫ్యామిలీకి రాజకీయంగా కలిసి వస్తుందనే ఓ ఆలోచనతో కామారెడ్డి నుంచి బరిలోకి దిగేందుకు కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. అదీకాక.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిని గంపగుత్తగా గెలుచుకొంటే.. దేశ రాజధాని హస్తిన పీఠాన్ని సునాయాసంగా కైవనం చేసుకోవచ్చునన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే ప్రధాని మోదీ గతంలో సొంత రాష్ట్రం గుజరాత్‌లోని బరోడా నుంచే కాకుండా.. యూపీలోని వారణాసి నుంచి కూడా పోటీ చేసి.. రెండు చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బరోడా లోక్‌సభ స్థానాన్ని వదులుకోగా.. సదరు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందిన విషయం విధితమే. దాదాపుగా అటువంటి ఆలోచనే.. గులాబీ బాస్‌ చేస్తున్నారని.. అయితే తన సొంత జిల్లా ఉమ్మడి మెదక్‌ నుంచి దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నా.. ప్రస్తుతం సదరు జిల్లాలో తనకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు రావడంతో.. ఆయన అప్రమత్తమై.. అటు గజ్వేల్‌ నుంచి ఇటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం… ఓ వేళ రెండు చోట్లు నుంచి గెలుపొందితే.. ఆ తర్వాత కామారెడ్డికి కేసీఆర్‌ రాజీనామా చేసి.. ఆ స్థానం నుంచి తన కుమార్తె కవితను గెలుపించుకొని.. అసెంబ్లీకి తీసుకువెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం తెలంగాణ పోలిటికల్‌ సర్కిల్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత….తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ ఫలితాలతో తెలంగాణలో బీజేపీ కొద్దిగా డల్‌ అయింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పుకు కమలం పార్టీ అగ్రనేతలు శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపుతో తెలంగాణలోని ఆ పార్టీకి నయా జోష్‌ వచ్చినట్లు అయింది. ఆ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ మాత్రం.. ఈ సారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అలాంటి పరిస్థితుల్లో ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడం కోసం.. తెలంగాణలో కారు పార్టీని షికార్‌ చేయించడం కోసం.. గులాబీ బాస్‌ కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే కామారెడ్డి నుంచి పోటీ చేయమని పార్టీ శ్రేణులు కొరాయంటూ.. ఆయన కొత్త పల్లవి అందుకోవడం వెనుక ఇంత కథ ఉందని పోలిటికల్‌ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *