సెమీస్ లో స్వియటెక్‌

పారిస్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నిలబెట్టుకొనే దిశగా మరో అడుగేసింది. ఈ పోలెండ్‌ స్టార్‌ సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. స్వియటెక్‌తోపాటు బ్రెజిల్‌కు చెందిన బియాట్రిజ్‌ హదాద్‌ మయా కూడా సెమీస్‌ చేరింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్‌ స్వియటెక్‌ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆర సీడ్‌ కొకొ గాఫ్‌ (అమెరికా)ను చిత్తు చేసింది. గత ఏడాది ఫైనల్లో గాఫ్‌ను ఓడించిన స్వియెటెక్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్‌ నెం.1 ఇగా.. రొలాండ్‌ గారో్‌సలో తన రికార్డును మరింతగా… అంటే 26-2కు పెంచుకుంది. 19 ఏళ్ల అమెరికన్‌తో ముఖాముఖి పోరులో స్వియటెక్‌కు ఇది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. గురువారం జరిగే సెమీఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన 14వ సీడ్‌ హదాద్‌ మయాతో స్వియటెక్‌ అమీతుమీ తేల్చుకోనుంది. హదాద్‌ 3-6, 7-6 (5), 6-1తో ఏడో సీడ్‌ ఆన్స్‌ జెబ్యూర్‌ (ట్యునీసియా)కు షాకిచ్చింది. ఓపెన్‌ ఎరాలో రొలాండ్‌ గారో్‌సలో సెమీస్‌ చేరిన తొలి బ్రెజిల్‌ క్రీడాకారిణిగా హదాద్‌ రికార్డు సృష్టించింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 22వ సీడ్‌ జ్వెరెవ్‌ 6-4, 3-6, 6-3, 6-4తో మార్టిన్‌ ఎట్చ్‌వరీ (అర్జెంటీనా)పై గెలిచి సెమీస్‌ చేరాడు. ఇక, మంగళవారం అర్ధరాత్రి జరిగిన మరో క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ అల్కారస్‌ 6-2, 6-1, 7-6 (5)తో ఐదో సీడ్‌ సిట్సిపా్‌సపై నెగ్గి జొకోతో సెమీస్‌ పోరుకు సిద్ధమయ్యాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *