సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మెరైన్.. 55 మంది నావికులు జల సమాధి !

చైనా: చైనాకి చెందిన ఓ సబ్ మెరైన్(Submarine) ఎల్లో సీ(Yellow Sea)లో చిక్కుకోవడంతో పదుల సంఖ్యలో నావికులు(Sailors) ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూకేకు(UK) చెందిన ఓ రిపోర్ట్ నివేదించింది. వివరాలు..న్యూక్లియర్ సబ్‌మెరైన్(Nuclear Submarine) లో 55 మంది చైనా నావికులు ప్రయాణిస్తున్నారు. చైనా(China) శత్రు దేశాల కోసం గతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ లో సబ్ మెరైన్ ఇరుక్కుంది. దీంతో అది ఏటు కదల్లేకుండా గంటల తరబడి అక్కడే నిలిచి పోయింది. నావికుల కోసం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ వ్యవస్థ పని చేయలేదు. ఎమర్జెన్సీ టైంలో పని చేయాల్సిన సిస్టమ్ కూడా ఆఫ్ అయింది. దీంతో ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరి అయి 55 మంద నావికులు అందులోనే జల సమాధి అయ్యారు. మరణించిన వారిలో కెప్టెన్ కల్నల్ జు యోంగ్-పెంగ్ తో పాటు.. 27 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీస్ క్యాడెట్లు, 17 మంది నావికులు, 9 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సబ్ మెరైన్ లో సిస్టమ్ వైఫల్యం కారణంగానే వారంతా చనిపోయినట్లు రిపోర్ట్ నివేదించింది

అదంతా అబద్ధం..

నావికులు మృతి చెందారన్న యూకే రిపోర్ట్ ని చైనా ఖండించింది. సబ్ మెరైన్ చిక్కుకుపోయిన మాట వాస్తవం కానీ.. నావికులు ప్రాణాలు కోల్పోయారనడం అవాస్తవమని పేర్కొంది. అమెరికా(US), దాని మిత్ర దేశాల సబ్‌మరైన్స్‌ని ట్రాప్‌ చేసేందుకు చైనా నేవీ ఏర్పాటు చేసిన చైన్, లంగర్‌ని ఢీకొట్టడంతో సబ్ మెరైన్ వ్యవస్థ ధ్వంసమైంది. ఆక్సిజన్ అందక నావికులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ చైనా ఇప్పటికీ దీనిని ధ్రువీకరించట్లేదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *