నేనే నెంబర్‌ వన్‌`ఎలాన్‌ మస్క్‌

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారారు. ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను దాటి ఫస్ట్‌ ప్లేస్‌లోకి దూసుకెళ్లారు. గత కొన్నాళ్లుగా మస్క్‌ మామ సంపద పెరిగింది. అదే సమయంలో, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఆస్తుల విలువ తగ్గింది. పారిస్‌ స్టాక్‌ మార్కెట్‌ ట్రేడిరగ్‌లో, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్వీఎంహెచ్‌ కంపెనీ షేర్లు 2.6 శాతం క్షీణించాయి.
ప్రపంచంలోని టాప్‌`500 రిచ్చెస్ట్‌ పీపుల్‌ లిస్ట్‌ అయిన బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో అగ్రస్థానం కోసం ఈ ఏడాది ఎక్కువ పోటీ కనిపించింది. కొన్నిసార్లు ఎలాన్‌ మస్క్‌, మరికొన్నిసార్లు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ టాప్‌`1 పొజిషన్‌లోకి వచ్చారు. ఈ ఏడాదిలో ఎక్కువ కాలం పాటు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ పైచేయి సాధించగా, ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఫ్రెంచ్‌ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ వయస్సు 74 సంవత్సరాలు. గత ఏడాది డిసెంబర్‌లో, మస్క్‌ను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. ప్రపంచ ప్రసిద్ధ లగ్జరీ బ్రాండ్‌లను ఉత్పత్తి చేసే ఎల్వీఎంహెచ్‌ కంపెనీ ఆర్నాల్ట్‌ సొంతం. లూయిస్‌ విట్టన్‌, ఫెండి, హెన్నెస్సీ సహా చాలా బ్రాండ్‌లు బెర్నార్డ్‌ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తాయి. బ్లూమ్‌బెర్గ్‌ రిపోర్ట్‌ ప్రకారం, చైనా వంటి ముఖ్యమైన మార్కెట్‌లో ఆర్థిక వృద్ధి మందగమనంతో, లగ్జరీ ఉత్పత్తుల రంగం దిగాలు పడిరది. ఆ ఎఫెక్ట్‌తో, ఏప్రిల్‌ నుంచి ఎల్వీఎంహెచ్‌ షేర్లు సుమారు 10 శాతం పడిపోయాయి.ఒకానొక సమయంలో, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ నికర విలువ ఒకే రోజులో 11 బిలియన్‌ డాలర్లు తుడిచి పెట్టుకుపోయింది. పారిస్‌ స్టాక్‌ ఎక్సేంజీలో, బుధవారం ట్రేడిరగ్‌లో ఎల్వీఎంహెచ్‌ షేర్ల నష్టం కారణంగా మొత్తం ఆస్తుల విలువలో 5.25 బిలియన్‌ డాలర్లు తగ్గింది. ఇప్పుడు, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మొత్తం ఆస్తుల విలువ 186.6 బిలియన్‌ డాలర్లు. ప్రస్తుత పతనం కంటే ముందు ఎల్వీఎంహెచ్‌ షేర్లు రాణించడంతో ఈ ఏడాదిలో ఈ కుబేరుడి సంపద 24.5 బిలియన్‌ డాలర్లు పెరిగిందితాజాగా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కిరీటం నెత్తికెత్తుకున్న ఎలాన్‌ మస్క్‌ నికర విలువ 192.3 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం, ఎలాన్‌ మస్క్‌ మొత్తం ఆస్తులు బుధవారం నాడు 1.98 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. ఈ ఏడాది అతని మొత్తం ఆస్తుల విలువ 55.3 బిలియన్‌ డాలర్లు పెరిగింది. టెస్లా షేర్లు బాగా పుంజుకోవడంతో మస్క్‌ సంపద పెరిగింది. మస్క్‌ మామ మొత్తం ఆస్తుల్లో 71 శాతం వాటా టెస్లా షేర్ల నుంచే వస్తుంది. ఈ షేర్లు ఈ సంవత్సరంలో 66 శాతం ర్యాలీ చేశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *