మరో యాత్రకు కమలం సమాయాత్తం

యాత్రలు పలు రకాలు. భక్తులు దూరప్రాంతాల్లోని పెద్దపెద్ద దేవాలయ దర్శనానికి చేసే యాత్రలు, హిమాలయాలకు వెళ్లే జనం యాత్ర, అయ్యప్ప దీక్షలుపట్టి వెళ్లవారి యాత్ర. ఇప్పుడు రాజకీయపరమైన కాషాయరంగుతో కొత్తగా వినపడుతున్నది బీజేపీ యాత్ర. ఈ యాత్ర రాజకీయపరమై దండయాత్రకు కాస్తంత తక్కువ స్థాయిది. దీనికి కార్యకర్తలు, పెద్ద పెద్ద పార్టీ పతాకాలతో వీలయినన్ని రకరకాల బళ్ల విూద నాయకుని వెంట వేలంవెర్రిగా చేసే యాత్ర. దీనికి లక్ష్యం కేవలం రాజకీయ లబ్ధి. కేవలం ఆయా ప్రాంత పాలకుల విూద గొంతు చించుకోవడానికి, నినాదాలతో హోరెత్తిండం దాని లక్ష్యం.రాజకీయంగా తమ స్థిరత్వాన్ని నిరూపించుకోవడానికి, తమ సత్తాను ప్రజలకు, పాలకవర్గీయులకు గట్టిగా తెలియజేయడానికి, తమను మించినవారు వేరెవ్వరూ లభించరన్న ప్రచారం చేసుకోవడంలో ఉవ్వె త్తున భారీ ప్రచారహోరుతో చిన్నా చితకా నాయకులు ఊరేగే యాత్ర. దీనికి కేవలం తమ పార్టీ నీడలో బాగా ప్రశాంతంగా ఉండవచ్చన్న నమ్మకం కలిగించడానికి వీలయినన్ని తిట్ల దండకంతో విపక్షాలవిూద విరుచుకుపడే అవకాశం ఉంటుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎలాగయినా రెండు రాష్ట్రాల సీఎంలు ప్రజాభిమానాన్ని పొందని నాయకులుగా ప్రచారం చేసి తమ పార్టీయే ప్రజాసంక్షేమాన్ని నిజంగా కోరుకుంటోందన్నది ప్రచార హోరుతో ప్రజల్ని ఆకట్టు కుంటూ అధికారంలోకి వచ్చేయాలన్న ఆకాంక్షతో బీజేపీ రెచ్చి పోయి రాజకీయ యాత్రలు చేపడుతోంది. ఏదో ఒకసమస్యను సృష్టించడమో, ఉన్నదాన్ని కాస్తంత విమర్శల కారం పూసి పాలకపక్షాన్ని మరింత విసిగెత్తించి అసహనాన్ని అనుకూలం చేసుకోవడంలో బీజేపీ నాయకుల మేధోశక్తి మరెవరికీ ఉండదు. అది వారికి వెన్నతో పెట్టినవిద్య. నిన్న మొన్నటివరకూ తెలంగాణాలో భారీ ప్రదర్శనలు, సమావేశాలతో ఊదరగొట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని, పాలనా విధానాన్ని, పథకాల అమలు అన్నింటా ప్రజల్ని మోసం చేశారని ఘాటుగా విమర్శిస్తూ ప్రజల అభిమానాన్ని పొందేందుకు బీజేపీ సీనియర్‌ నాయకులు కూడా ఢల్లీి నుంచి తెలంగాణా యాత్రలు చేశారు. అక్కడ మునుగోడు ఉప ఎన్నిక లక్ష్యంతో ప్రజల్ని ఓటర్లను తమ వేపు తిప్పుకోవడానికి వేయాల్సిన వలలన్నీ పన్ని వేశారు, వేస్తున్నారు. ఇపుడు కాస్తంత సమయం తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ వేపు మరో యాత్రకు బీజేపీ సిద్ధ పడిరది. రాయలసీమ ప్రాంతంలోని పెండిరగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ మరోయాత్ర కు రాష్ట్ర బిజేపీ నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు యాత్రకు నాయకత్వం వహించనున్నారు. బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 25 చోట్ల బహి రంగ సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానా లకు వ్యతిరేకంగానూ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నాయకులు వివరిం చను న్నారు. కేవలం తమకు దేశంలో ప్రతిపక్షం ఉండకూడదన్న యావతోనే ఇటువంటి యాత్రలతో విపక్షాలను భయాందోళనకు గురిచేయడానికి, ప్రజలను మరింత సందిగ్ధంలో పడేయడానికి పూనుకున్నారేగాని వాస్త వానికి కేంద్రంలో తమ పాలన విషయంలో తలెత్తుతున్న వ్యతిరేకతలను పట్టించుకోవడం మేలు. కానీ వారికి దక్షిణాదిన ఎలాగయినా పట్టు సాధించాలన్న లక్ష్యమే జీవిత లక్ష్యంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *