బ్రిటిషోల్లను హడలెత్తించిన విప్లవవీరుడు రాజ్‌ గురు

హరి శివరాం రాజ్‌ గురు భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఉద్యమకారుడు.. ఇతను భగత్‌ సింగ్‌, సుఖ్‌దేవ్‌ ల సహచరునిగా గుర్తింపు పొందాడు. కామ్రేడ్‌ శివరాం రాజ్‌ గురు మహారాష్ట్ర పూణే దగ్గరలోని కేడు గ్రామంలో పార్వతి దేవి హరి నారాయణ రాజు గురు దంపతులకు 1908 ఆగస్టు 24న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన విప్లవ కిశోరం కామ్రేడ్‌ శివ రామ్‌ రాజగురు చిన్నప్పటి నుంచే జాతీయ భావాలతో పెరిగారు. రాజ్‌ గురు స్వాతంత్ర పోరాటం వైపు పయనించాడు. 1928 ఫిబ్రవరిలో భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి సైమన్‌ కమిషన్‌ గోబ్యాక్‌ అంటూ జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన లాలాలజపతిరాయ్‌ పోలీసులు లాఠీఛార్జి కిరాతకంగా హత్య చేశారు. సైమన్‌ కమిషన్‌ లో ఒక భారతదేశ సభ్యులు కూడా లేకపోవడం భారతీయుల్లో మరింతగా ఆవేశం వచ్చింది. లాలాలజపతిరాయ్‌ మృతిపట్ల భారతదేశంలో యువత లో తీవ్రమైన వ్యతిరేకత రావడం బ్రిటిష్‌ పాలనను ఎలాగైనా తరిమికొట్టాలని లక్ష్యంతో సాగారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే యువతలో చైతన్యం చేస్తూ భారత స్వాతంత్ర పోరాటంలో యువతను భాగస్వామ్యం చేయడం కోసం కీలకమైన కృషి చేయడం జరిగింది. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని లక్ష్యంతో జరుగుతున్న పోరాటంలో హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఆర్మీ కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో రాజ్‌ గురు కూడా సభ్యులుగా చేరారు. లాలాలజపతిరాయ్‌ లాఠీఛార్జ్‌ చేసిన అధికారిని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు ఇతరులు కలిసి పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వస్తున్నటువంటి జాన్‌ సాండర్స్‌ అనే బ్రిటిష్‌ అధికారి ని కాల్చి చంపడం జరిగింది. కొద్దికాలం పాటు అజ్ఞాత వాసం లో ఉంటూ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించేందుకు దేశవ్యాప్తంగా హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఆర్మీ పనిచేసింది. ఢల్లీిలో జరిగిన అసెంబ్లీలో బాంబు వేసి భగత్‌ సింగ్‌ స్వచ్ఛందంగా లొంగిపోవడంతో వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. కొద్దికాలం తరువాత ఈ కేసులో ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు అధికారులు రాజ్‌ గురును కూడా అరెస్ట్‌ చేయడం జరిగింది. సాండర్స్‌ హత్య కేసులో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు ఉరి తీయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. 1931 మార్చి 23 వ తేదీన లాహోర్‌ జైల్లో విప్లవ కిశోరాలను ఉరి తీయడం జరిగింది.ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ బ్రిటిష్‌ వలస పాలన మాకొద్దు అంటూ స్వాతంత్య్రమే మా జన్మహక్కని నినాదాలు చేస్తూ వీర మరణం పొందారు. ఉరితీసిన నాటికి భగత్‌ సింగ్‌,సుఖదేవ్‌ ల వయస్సు 23 సంవత్సరాలు అయితే రాజుగురు వయస్సు 22 సంవత్సరాలే దేశ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం వీర మరణం పొందిన వంటి వీరుల త్యాగాలు మరువలేనివి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *