అమ్మకానికి హెచ్‌ఎండీఏ ప్లాట్లు

హైదరాబాద్‌ లో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను మరోసారి వేలం వేసేందుకు సిద్ధం అయింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్‌ శివార్లలోని బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల్లిలో 85 ఫ్లాట్లకు వచ్చే నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్‌ లైన్‌ లో వేలం నిర్వహించనున్నారు. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లిలో 27 ఎకరాలు, మేడిపల్లిలో 55 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హెచ్‌ఎండీఏ భారీ లే అవుట్లను అభివృద్ధి చేసింది. మార్చిలో మొదటి విడత కింద కొన్ని ప్లాట్లను విక్రయించగా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో తాజాగా రెండో విడత కింద రెండు లే అవుట్లలోని ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ను జారీ చేసింది. బాచుపల్లిలో చదరపు గజానికి రూ.25 వేలు, మేడిపల్లిలో రూ.32 చొప్పున ఉండాలని నోటిఫికేషన్‌ లో సూచించింది. మరింత సమాచారం కోసం హెచ్‌ఎండీఏ వెబ్‌ సైట్‌, ఎంఎస్‌ టీసీ ఈ కామర్స్‌, ఎంఎస్టీసీ ఇండియా వెబ్‌ సైట్లను సంప్రదించాలని తెలిపింది. లేఅవుట్‌ ల సందర్శనకు, సందేహాల నివృత్తి కోసం 7396345623, 915484321 నంబర్లకు సంప్రదించాలని అధికారులు తెలిపారు. తొర్రూర్‌, బహదూర్‌ పల్లిలో అభివృద్ధి చేసిన ఓపెన్‌ ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని లే అవుట్లలోని 324 ప్లాట్లకు వేలం వేసింది. బహదూర్‌ పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్‌ లో 223 ప్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మార్చి మూడో వారంలో ఈ`వేలం ద్వారా ప్లాట్లను విక్రయించా. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేడ్చల్‌ జిల్లాలోని బహదూర్‌ పల్లి, రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్‌ లోని ప్లాట్లను ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో వేలం ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ అన్ని ఏర్పాట్లు చేయగా.. మార్చి 14, 15 తేదీల్లో బహదూర్‌పల్లిలోని 101 ప్లాట్లు, తొర్రూర్‌లోని 223 ప్లాట్లను వచ్చే నెల 14 నుంచి 17 వరకు ఈ`వేలం వేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కోకాపేట్‌, ఖానామెట్‌, ఉప్పల్‌ భగాయత్‌ భూములను హెచ్‌ఎండీఏ విజయవంతంగా విక్రయించింది. ఇప్పుడు జరగబోయే ఈ వేలాల ద్వారా కూడా భారీగానే డబ్బులు సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి హెచ్‌ఎండీఏకు ఏ మేర నిధులు వస్తాయో. బహదూర్‌పల్లిలో గజానికి రూ.25 వేలు, తొర్రూర్‌లో గజానికి రూ.20 వేలు కనీస ధరను హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. బహదూర్‌ పల్లిలో 600 గజాల వరకు ఒక్కో ప్లాటుకు రూ.3 లక్షలు, 600 గజాలు దాటితే రూ.5 లక్షలు, తొర్రూరులో ఒక్కో ప్లాట్‌కు రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కోకాపేట, ఉప్పల్‌ భగాయత్‌ వెంచర్లలో ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేసింది. ఈ భూములకు రూ.వేల కోట్లు పలికాయి. తాజాగా మరో రెండు వెంచర్లలో ప్లాట్ల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వెంచర్ల ప్లాట్ల విక్రయం ద్వారా కూడా కోట్లాది రూపాయలు సమకూర్చుకునే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *