ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు 7 వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. 296 పరుగుల లక్ష్యంతో.. ఓవర్‌నైట్‌ 183/2తో చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. బెయిర్‌స్టో (71నాటౌట్‌), రూట్‌ (86 నాటౌట్‌) ఎదురుదాడితో అలవోకగా 296/3 స్కోరు చేసి నెగ్గింది. రూట్‌తో కలిసి పోప్‌(82) మూడో వికెట్‌కు 134.. రూట్‌, బెయిర్‌స్టో నాలుగో వికెట్‌కు అభేద్యంగా 111 రన్స్‌ జత చేశారు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, రూట్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గా నిలిచారు.
సంక్షిప్తస్కోర్లు:న్యూజిలాండ్‌:329, 326; ఇంగ్లండ్‌: 360, 296/3.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *