బలంగా నియోజకవర్గాల్లోనే వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎట్టకేలకు వారాహిని రోడ్డు విూదకు తెస్తున్నారు. పధ్నాలుగో తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుంది. మొదట తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో యాత్ర సాగుతుంది. తిరుపతి నుంచి వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని గతంలో జనసేన ప్రకటన చేసింది. ఇప్పుడు రూటు మారింది. అన్నవరం నుంచి ప్రారంభానికి నిర్ణయించారు. పొత్తులు ఖాయమని ఇప్పటికే పవన్‌ స్పష్టం చేసినందున పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవాలని అనుకుంటున్నారు. బలం ఉన్న చోట్ల ఖచ్చితంగా పోటీ చేస్తామని.. పవన్‌ చెబుతున్నారు. బలం ఉందని భావిస్తున్న గోదావరి జిల్లాల్లోనే మొదట పవన్‌ రంగంలోకి దిగుతున్నట్లుగా బావిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అక్కడి సామాజిక సవిూకరణాలు తనకు కలిసి వస్తాయనే అంచనాలతో ఉన్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తుతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్‌ పలు సందర్భాల్లో చెప్పారు. టీడీపీతో పొత్తు వేళ ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కానున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఎక్కవ సీట్లు సాధిస్తే అధికారం కు దగ్గర అవుతామనే అంచనాలు ఉన్నాయి. అందులో భాగంగా అన్నవరం నుంచి వారాహితో పవన్‌ ప్రజల్లోకి రావాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరిలోనూ యాత్ర కొనసాగుతుందని చెప్పినా..పూర్తి స్థాయిలో షెడ్యూల్‌ ఖరారు కాలేదు. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు పవన్‌ వారాహి యాత్ర ప్రారంభం పైన నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.బీజేపీ కలిసొచ్చినా, లేకున్నా టీడీపీ..జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు. టీడీపీ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్‌ కల్యాణ్‌ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సారి రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి యాత్రకు నిర్ణయించటంతో ఈ సారి తూర్పు గోదావరిలోని పిఠాపురం లేదా కాకినాడ రూరల్‌ నుంచి పవన్‌ పోటీ చేస్తారనే వాదన బలపడుతోంది. తన యాత్రలో భాగంగా నియోజకవర్గంలో పవన్‌ ఫీల్డ్‌ విజిట్‌ ఉంటుందని ప్రకటించారు. ప్రతీ రోజు ఉదయం నియోజకవర్గం లో ప్రజల నుంచి వినతులు స్వీకరించేలా నిర్ణయించారు. వీటి ద్వారా స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పైన హావిూ ఇచ్చేలా పవన్‌ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. టీడీపీ యువ నేత నారా లోకేష్‌ రాయలసీమలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. సీమలోని మూడు జిల్లాల్లో లోకేష్‌ యాత్ర పూర్తయింది. ఈ కారణంగానే తిరుపతి నుంచి వారాహి యాత్ర ప్రారంభించాలని భావించినా.. ఆలోచన మార్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో యాత్ర ఎన్ని రోజులు ఉంటుందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఎక్కువ సమయం ప్రజలతో గడుపుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. రోజుకో నియోజకవర్గం చొప్పున పర్యటన చేసినా దాదాపు 40 రోజులు గోదావరి జిల్లాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఎన్నికలయ్యే వరకూ ప్రజల్లోనే ఉంటారా లేకపోతే.. గ్యాప్‌ వస్తుందా అన్నది ముందస్తు ఎన్నికల వేడిని బట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *