పొత్తులకు ఓకే….

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గన్నవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ సీనియర్‌ నేత పురంధేశ్వరి ప్రకటించారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను జాతీయ నాయకులకు వివరిస్తున్నామన్నారు. పార్టీ అంతర్గత చర్చలను విూడియాకు తాను చెప్పలేనన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందన్నారు. అన్ని రంగాల్లో వైసీపీ సర్కార్‌ వైఫల్యం చెందిందని ఆమె విమర్శించారు. జగన్‌ సర్కార్‌ పై చార్జీషీట్లు నిర్వహిస్తున్న విషయాన్ని పురంధేశ్వరి తెలిపారు. గ్రామం నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ అవినీతిపై చార్జీషీట్‌ విడుదల చేస్తున్నామన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పొత్తులపై కామెంట్లు చేశారు. పొత్తులపై చర్చ లేదని. అధిష్టానానికి అన్నీ వివరించామని స్పష్టం చేశారు. పొత్తు అంశం తాము చర్చించలేదని మరో క్లారిటీ ఇచ్చారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు ఎలా వెళ్లాలి అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది అని, పవన్‌ కళ్యాణ్‌ చేసిన సూచనలపై జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందని జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలా వెళ్లాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని..మరి ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ చేసిన సూచనలపై జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని రాష్ట్రం సంక్షేమమే ముఖ్యమని దాని కోసం తాను పనిచేస్తానని వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పదే పదే చెబుతున్నారు. దీని కోసం పొత్తుల గురించి కూడా పవన్‌ నెట్వర్క్‌ చేస్తున్నారు. పొత్తుల గురించి ప్రధానంగా ఏపీలో చర్చ జరుగుతోంది. టీడీపీ,జనసేన పొత్తు ఖరారు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇరు పార్టీల అధినేతలు ఎక్కడా క్లారిటీ ఇవ్వకపోయినా ప్రజల్లో మాత్రం వీరిద్దరి పొత్తు ఖరారు అనే అభిప్రాయం నాటుకుపోయింది. ఇక పోతే బీజేపీ పవన్‌ తో మా పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. టీడీపీతో పవన్‌ పొత్తు పెట్టుకుంటే తాము జనసేనతో పొత్తులో ఉండం అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ పవన్‌ మాత్రం వైసీపీని గద్దె దించాలంటే టీడీపీతో పొత్తు అవసరమనే అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీని కూడా ఒప్పించి పొత్తుతో కొనసాగాలని యోచిస్తున్నారు. అదే విషయాన్ని చెబుతున్నారు. ఈక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలు పవన్‌ కల్యాణ్‌ అంటే బీజేపీ అధిష్టానినకి ఎంతటి గురి ఉందో అర్థమవుతోంది. ఏపీలో పొత్తుల గురించి..రాజకీయ పరిస్థితుల గురించి పవన్‌ కల్యాణ్‌ సూచనలను బీజేపీ జాతీయ వర్గం ఆలోచిస్తోందని చెప్పడం కీలకమైన మార్పుగా భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *