ఏపీలో కొత్త పార్టీ…

విశాఖపట్టణం, నవంబర్‌ 30
జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన విూడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో రానున్న ఎన్నికల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త పార్టీల అవసరం ఏపీలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న రెండు పార్టీల పాలనను ప్రజలు చూశారని, అయితే ఎవరు వచ్చినా రాష్ట్రాభివృద్ధి ఆశించినంత మేర జరగడం లేదని ప్రజలు ఎక్కువ మంది ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. దీనిపై మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అందరితో మాట్లాడిన తర్వాత కొత్త పార్టీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జేడీ లక్ష్మీనారాయణ గత లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున విశాఖ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠకు ఆయన తెరదించారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ నుంచి పార్లమెంట్‌ కు పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ సినిమాలు చేస్తున్నరన్న కారణం చూపి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత స్వచ్చంద సంస్థ పెట్టుకుని వ్యవసాయ అంశాలపై పని చేస్తున్నారు. విశాఖలోనే మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన పలు అంశాలపై స్పందిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేసు వేసి పోరాడుతున్నారు. అయితే ఆయన అన్నిపార్టీలనూ పొగుడుతూండటంతో ఎప్పటికప్పుడు ఆయన ఫలానా పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. విశాఖలో జేడీ ఫౌండేషన్‌, నిపుణ హ్యూమన్‌ డెవలప్మెంట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 2న విశాఖలో మెగా జాబ్‌ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌ ఫేర్‌లో 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు.సెలెక్ట్‌ అయిన వారికి అక్కడికక్కడే ఆఫర్‌ లెటర్లను ఇస్తామని వెల్లడిరచారు. పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్నవారు జాబ్‌ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. కొంచెం వెనుకబడిన అభ్యర్థులకు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌ ను నిర్వహిస్తామని తెలిపారు.తాను కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ తరుపునే విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం.బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతారని ఏపీ అధ్యక్ష పదవి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కేసీఆర్‌ నిర్ణయాలను పలుమార్లు ప్రశంసించారు. కానీ తర్వాత అలాంటిదేవిూ లేదని ప్రకటించారు. ఓ సారి వైసీపీ అధినేత ను కూడా ప్రశంసించారు. దాంతో ఆయన వైసీపీలో కూడా చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆ విషయాన్నీ ఆయన ఖండిరచారు. టీడీపీలో చేరే విషయంపై ఎప్పుడూ రూమర్స్‌ రాలేదు కానీ మళ్లీ జనసేనలో చేరుతారన్న చర్చ అయితే జరిగింది. కానీ పవన్‌ ఆయనను ఆహ్వానించలేదు… ఆయన కూడా పవన్‌ ను పార్టీలోకి వస్తానని అడగలేదు. ఈ కారణంగా పెండిరగ్‌ పడిపోయింది. చివరిగా ఆయన సొంత పార్టీ ఆలోచన చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *