మెదక్‌ లో మేక తలకాయల ఆఫర్‌

ఫ్రీగా వస్తుందంటే ఏ ఛాన్స్‌ మిస్‌ చేసుకోను మనోళ్లు. ఏదైన ఉచితంగా లభిస్తుందంటే చాలు దాని కోసం ఎంతకైన వెళ్లారు. అసలు విషయం ఏంటంటే? మేక తలకాయలు, కాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా కొట్టడంతో.. పాయా అంటే ఇష్టపడే వారి పంట పండిరది. రూపాయికి బిర్యాణీ అంటేనే కిలోవిూటరు పొడువున క్యూ ఉన్నా.. ఇబ్బంది పడకుండా చేతికి టోకెన్‌ వచ్చేంత వరకు వెయిట్‌ చేస్తారు. అదే మేక తలకాయలు, కాళ్ల ఊరుకుంటారా..? ఫ్రీగా వస్తుంటే వదుకోవడం సమజసం కాదనుకున్నారో ఏమో కానీ.. క్షణాల్లో వచ్చేశారు జనం. చేతిలో పెద్ద కవర్‌ పట్టుకుని వచ్చి, చేతికందినన్ని మేక తలకాయలు, కాళ్ల తీసుకు పోయారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జరిగింది. తూప్రాన్‌లో విూదుగా మేక తలకాయలు, కాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిరది. మేక తలకాయ కాళ్లు రోడ్లపై పడిపోయాయి. దీంతో రామాయంపేట వాసులు కాళ్ళు, తలకాయలు తీసుకెళ్లడానికి ఎగబడ్డారు. అందరికి మందికి నోరూరించే మేక తలకాయలు, కాళ్ల కూర అంటే తెగ ఇష్టపడుతారు. వాటి ధర కూడా మార్కెట్‌లో ప్రస్తుతం భారీగానే పలుకుతోంది. దీంతో దొరికిందే అవకాశమని జనం ఒక్కసారిగా పరుగులు తీస్తూ వచ్చారు. చేతికందినన్ని మేక తలకాయలు, కాళ్ల తీసుకుని ఎంచక్కా ఇంటికి పోయారు. కొందరైతే తమ దగ్గర ఉన్న సంచులలోనూ, ఇంకొందరు ఏవిూ లేకపోవడంతో రెండు చేతుల్లో నాలుగు మేక తలకాయలు తీసుకుని ఇంటికి తీసుకుపోయారు. కాళ్ళు, తలకాయల కోసం చాలా మంది ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కొందరు వాహనదారులు కూడా ఉట్టి చేతులతో వెళ్లడం ఎందుకనుకున్నారో ఏమో? ఒక తల నాలుగు కాళ్లు పట్టుకెళ్లారు. దీంతో గంటలో లోడ్‌ మొత్తం ఖాళీ అయింది.ఉత్తర ప్రదేశ్‌ లక్నో నుంచి హైదరాబాద్‌ కు మేక తలకాయలు, కాళ్లు ఐస్‌ బాక్స్‌ ల్లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కి గాయాలయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *