మళ్లీ కన్నా, రాయపాటి లొల్లి….

ఉమ్మడి గుంటూరు జిల్లాలో,.. కాదు కాదు.. అసలు ఏపీ రాజకీయాల్లోనే రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వైరం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి నేతలు ఆ మధ్య ఓ పరువు నష్టం కేసులో రాజీ చేసుకుని.. కోర్టులో చేతులు కలుపుకుని దోస్త్‌ మేరా దోస్త్‌ అనేసుకున్నారు. అనుకున్నట్లే మూడు నెలలు కామ్‌గానే ఉన్నారు. కానీ.. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలోకి చేరిపోయారు. అదే పార్టీలో సీనియర్‌గా ఉన్న రాయపాటి .. కన్నా రాకను బహిరంగంగా వ్యతిరేకించినా ఏవిూ చేయలేకపోయారు. చివరికి తనదైన భాషలో పార్టీకి, కన్నాకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మళ్ళీ కొన్నాళ్ళ మౌనం తర్వాత కన్నా ఇచ్చిన విందుకు తన సోదరుడు రాయపాటి శ్రీనివాసరావును పంపించారు సాంబశివరావు. అక్కడితో కథ సుఖాంతమైందని అంతా అనుకున్నారు. కానీ.. మేటర్‌ మిగిలే ఉందని చెబుతున్నాయి రాయపాటి తాజా వ్యాఖ్యలు.ఎన్నాళ్ళో వేచిన ఉదయం లాగా? ఎన్నాళ్లో వేగిన హృదయం నాది అని సాంగేసుకుంటూ కన్నా విూద కామెంట్స్‌ చేస్తున్నారట. నన్ను దశాబ్ద కాలం వేధించారు, రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు పెట్టారని, ఆయనతో రాజీ పడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారట రాయపాటి సాంబశివరావు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో? సరిగ్గా అక్కడే తన పరపతిని ఉపయోగించి ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టే ప్రయత్నం చేస్తున్నారట రాయపాటి. అదే క్రమంలో తన కొడుకు రంగబాబుకి సత్తెనపల్లి టీడీపీ టిక్కెట్‌ ఇవ్వాలన్న ప్రతిపాదనను తెరవిూదికి తెచ్చారట. కన్నా లక్ష్మీనారాయణ ఈసారి సత్తెనపల్లి విూద గురిపెట్టారని ముందుగా తెలుసుకున్న రాయపాటి ఆయనకు చెక్‌ పెట్టేందుకే తన కుమారుడిని ముందు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు బద్ధ విరోధులుగా ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు టిడిపిలో కూడా అదే తరహా రాజకీయాలను నడుపుతుండటంతో క్యాడర్‌ గందరగోళంలో పడుతోందట. అయితే? వ్యతిరేక చర్యలు ఏం చేసినా? అంతా రాయపాటే చేస్తున్నారు తప్ప ప్రస్తుతం ఈ వ్యవహారంపై కన్నా నోరు మెదపడం లేదట. సన్నిహితుల దగ్గర కూడా ఏం మాట్లాడకుండా తాను చేయదల్చుకున్నది చేసుకుని పోతున్నారట. అటు రాయపాటి మాత్రం టీడీపీలో తాను సీనియర్‌ అన్న విషయాన్ని పదేపదే గుర్తు చేస్తూ?తాను ఏం చేయబోతున్నానో? చెబుతున్నారట. కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వ్యతిరేక వర్గాన్ని కూడగట్టైనా సరే.. ఓడిస్తానని శపధం చేస్తున్నారట. దీంతో.. ఈ వైరం టీడీపీకి ఎంత నష్టం చేస్తుందోనని ఆందోళనలో ఉన్నారట కార్యకర్తలు. అధినాయకత్వంవెంటనే చెక్‌ పెట్టకుంటే? కాంగ్రెస్‌ తరహా వర్గపోరుతో ఇద్దరు సీనియర్స్‌ కలిసి పార్టీకి నష్టం చేస్తారని అంటున్నారట. రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకీ మారిపోతున్న తరుణంలో ఇలాంటి కొట్లాటలను ఉపేక్షిస్తే.. మొదటికే మోసం వస్తుందని అంటున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు సైతం. మరి ఈ విషయంలో టీడీపీ అగ్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ? కన్నా, రాయపాటి మధ్య సయోధ్య కుదర్చ గలుగుతుందా? లేదా అన్నది చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *