2400 కోట్లకు కేంద్రం బ్రేక్‌

ప్రధానమంత్రి ఆవాస్‌? యోజనా(అర్బన్‌?) కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 2400 కోట్లకు కేంద్రం బ్రేక్‌? వేసింది. ఈ నిధులకు మెలిక పెట్టింది. పేదల కోసం గృహాలు నిర్మిస్తుంటే.. ఆ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు ఉండాలని, అసలు ఇప్పటి వరకు లబ్ధిదారులు ఉన్నారా? అనే అంశంపై క్లారిటీ లేదని, అలాంటప్పుడు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిధులెలా ఇస్తామని ప్రశ్నించింది. గత నెలాఖరు వరకే లబ్దిదారుల జాబితా ఇవ్వాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో రూపాయి కూడా రాదని చెప్పింది. దేశవ్యాప్తంగా కోట్ల ఇండ్లు ఆల్రెడీ నిర్మించామని, త్వరలోనే కేంద్రస్థాయిలో కూడా పీఎంఏఏవైని క్లోజ్‌? చేస్తున్నామని హింట్‌? ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్థంలో పడిరది. ప్రస్తుత పరిస్థితుల్లో డబుల్‌? బెడ్‌? రూం ఇండ్లతో పాటుగా సొంత జాగా ఉంటే రూ. 3 లక్షల ఆర్థిక సాయానికి ఇవే నిధులపై ఆశలు పెట్టుకుంది. అందుకే కొత్తగా రూ. 1.60 లక్షల ఇండ్లు కావాలని కేంద్రానికి లేఖ రాసింది. కానీ, లబ్ధిదారుల జాబితా ఇస్తేనే మంజూరు చేస్తామంటూ కేంద్రం తేల్చి చెప్పింది.ఇండ్ల నిధులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దమే నడుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న రెండు పడకల ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న విధివిధానాలు వేరని, ముందుగా లబ్ధిదారుల ఎంపిక చేయలేమని, అవసరమైతే అండర్‌ టేకింగ్‌ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు పంపుతోంది. అయితే, తమ నిబంధనలు ఒక్క రాష్ట్రం కోసం సడలించమని, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం నుంచి లబ్ధిదారుల జాబితా ఇస్తేనే నిధులు ఇస్తామంటూ కేంద్రం కొన్నేండ్ల నుంచే చెప్పుతోంది. లబ్ధిదారుల జాబితా చూడనంత వరకు నిధుల విడుదల కుదరని స్పష్టం చేశారు. ఇలా దాదాపు ఏడాది కాలంగా లేఖలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.ఇప్పటి వరకు పీఎంఏఏవై నిధులను తేలిగ్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం తీసుకునేందుకు ముందుకు వచ్చింది. తొలి మూడు విడుతల్లో రాష్ట్రానికి మంజూరు చేసిన పీఎంఏవై అర్బన్‌? కింద రూ. 194 కోట్లు 2018?19 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చారు. ఇంకా వీటికి రూ. 904 పెండిరగ్‌? ఉన్నాయి. వీటితోపాటుగా తాజాగా 1.60 లక్షల ఇండ్లను విడుదల చేయాలని ఇటీవల కేంద్రానికి లేఖ పంపింది. వాస్తవానికి డబుల్‌? బెడ్‌? రూం ఇండ్ల పథకంలో అర్బన్‌? కు కేంద్ర నిధులను వాడుకుంటోంది. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌? అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి కేంద్ర నిధులను వాడుకోవాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 1.60 లక్షల ఇండ్లు కావాలని కోరింది.గతంలో ఇందిరమ్మ పథకం కింద లక్షల్లో ఇళ్లను నిర్మించి పేదలకందించారు. పనులు మొదలయ్యేలోపే అర్హులను గుర్తించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేవారు. తర్వాత పనులు అయ్యే కొద్ది వారికి నిధులు విడుదల చేస్తుండేవారు. కేంద్రం తన వంతు వాటాగా నిధులిచ్చేది. కానీ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పథకంలో అర్హులకు సంబంధించి ఓ అంచనా మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తోంది. వాటిని అందించే వేళ లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఇళ్లను కేటాయిస్తోంది. 2.91 లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చిన ప్రభుత్వం.. 1.80 లక్షల ఇండ్లను మొదలు పెట్టి నిర్మాణం చేస్తోంది. వీటిలో లక్షన్నర ఇండ్లకు నిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు 17,000 మందికే ఇళ్లను అందజేశారు. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి అయినా.. లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. నిర్మాణ వ్యయం గ్రేటర్‌? హైదరాబాద్‌? పరిధిలో రూ. 7 లక్షలు, పట్టణాల్లో రూ. 5.70 లక్షలు, గ్రావిూణ ప్రాంతాల్లో రూ. 5.04 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీనికి నగరాలు, పట్టణాల్లో ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షలు, గ్రావిూణ ప్రాంతాల్లో రూ. 72 వేలు కేంద్రం వంతుగా ఇస్తోంది.గ్రావిూణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి తొలి విడుతలో కేంద్రం వాటా రూ. 381.58 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీనిలో రాష్ట్రానికి తొలి విడుతలో రూ. 191 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కేంద్రం నోటీసులిచ్చింది. పీఎంఏవై రూరల్‌? కింద కొంత మొత్తాన్ని ముందుగానే విడుదల చేస్తూ రెండో కిస్తీగా 40 శాతం మొత్తాన్ని ఇస్తుంది. మిగతా మొత్తాన్ని ఫైనల్‌ ఇన్‌స్పెక్షన్‌ తర్వాత విడుదల చేస్తుంది. లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి సమర్పించి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రం నుంచి లబ్ధిదారుల జాబితా ఇవ్వలేదు. దీంతో తొలి విడుతలోనే నిధులను పెండిరగ్‌? పెట్టింది. ఆ తర్వాత రాష్ట్రం కూడా పీఎంఏవై గ్రావిూణ పథకంలో ఉండమంటూ కేంద్రానికి తేల్చి చెప్పింది. కానీ, పీఎంఏవై అర్బన్‌? పథకంలో మాత్రం కొనసాగుతోంది.ఈసారి కేంద్ర నుంచి ఇండ్ల నిధులు తెచ్చుకోవాలని ప్రభుత్వం లెక్కలేసింది. దీనిలో భాగంగా పాత నిధులతో పాటుగా కొత్తగా 1.60 లక్షల ఇండ్లు కావాలని ఫిబ్రవరిలో లేఖ రాసింది. త్వరలో ఈ స్కీం పూర్తవుతుందని ఈ ఏడాది తొలుతనే కేంద్ర ప్రకటించింది. దీంతో రాష్ట్రానికి పీఎంఏవై అర్బన్‌? కింద పాత బకాయిలతో పాటుగా కొత్తగా రూ. 1.60 లక్షల ఇండ్లు ఇవ్వాలని రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపారు. కానీ, కేంద్రం మాత్రం నిబంధనలను సడలించలేదు. లబ్ధిదారుల జాబితా ఇస్తేనే విడుదల చేస్తామని రాష్ట్రానికి రిప్లై ఇచ్చింది. అయినా రాష్ట్రం నుంచి జాబితా ఇవ్వలేదు. దానికి మళ్లీ లేఖ పంపిన రాష్ట్రం.. లబ్ధిదారుల జాబితా మూడు నెలల్లో ఇస్తామని, ముందుగా నిధులు విడుదల చేయాలని కోరింది. కానీ కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఈ స్కీంపై అటు కేంద్రం కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒక్కో రాష్ట్రానికి సగటున 30 లక్షలకుపైగా ఇండ్లు ఇచ్చామని, ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస యోజనా క్లోజ్‌? చేయాలని కేంద్రం భావిస్తోంది. ఒకవేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి షాక్‌?. లబ్ధిదారుల జాబితా ఇవ్వకపోవడంత రూపాయి రానట్టే. అయితే, ఒకవేళ ఇండ్ల పథకాన్ని కేంద్రం పొడిగిస్తే.. అప్పుడు రాష్ట్రం నుంచి లబ్ధిదారుల జాబితా అందిస్తే పాత నిధులు దాదాపుగా రూ. 914 కోట్లతో పాటుగా 1.60 లక్షల ఇండ్లకు రూ. 2400 కోట్లు ఇవ్వాలని కోరినా కేంద్రం ఇవ్వనంటూ తేల్చింది. అయితే, దేశస్థాయిలో ఈ పథకాన్ని కొనసాగించే అంశంపై కేంద్రం ఇంకా పరిశీలన చేస్తోంది. పీఎంఏఏవైని కొనసాగిస్తే.. కేంద్రం చెప్పినట్టుగా మళ్లీ గడువు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా ఇస్తేనే ఇండ్ల నిధులకు అవకాశం ఉంటోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *