చేతివృత్తులకు విశ్వకర్మ యోజన

న్యూఢల్లీి, ఆగస్టు 17
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకొచ్చింది. అదే పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్‌. ఈ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్‌ కింద బ్రాహ్మణులు, చర్మకారులు, కమ్మరి, కుమ్మరి, ఇతర కులవృత్తుల వారికి రూ.2లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. గరిష్టంగా 5శాతం వడ్డీతో ఈ రుణాన్ని కేంద్రం అందించనుందిఇక, చేతివృత్తుల వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో శిక్షణ ఇచ్చి.. తర్వాత పరికరాల కొనుగోలుకు రూ.15వేల ఆర్థిక సాయం చేయనున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 17న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించనుంది.ఆగస్ట్‌ 15న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి విశ్వకర్మ పథకాన్ని ప్రకటించారు. నేడు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇస్తారు. పీఎం విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రులు తెలిపారు. గరిష్ఠంగా 5 శాతం వడ్డీతో ఈ రుణాలు పొందవచ్చన్నారు. ఈ స్కీమ్‌ కోసం కేంద్రం రూ.13 వేల కోట్లను వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా 30 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.ఈ పథకంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేంద్రం తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *