కమలం గూటికి సంపత్‌

మెదక్‌, అక్టోబరు 9
జహీరాబాద్‌ టికెట్‌ ఆశించి బీఆర్‌ఎస్‌ లో చేరిన ఢల్లీి సంపత్‌… పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. జహీరాబాద్‌ టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే కేటాయించడంతో…ఢల్లీి సంపత్‌ బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.జహీరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోరుతూ ఆ పార్టీలో చేరిన సామాజిక వేత్త ఢల్లీి వసంత్‌ బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్న ఢల్లీి వసంత్‌.. రెండు మూడు రోజుల్లో బీజేపీలో జాయిన్‌ అవుతారని ఆయన అనుచరులు అంటున్నారు. జులై వరకు వేరు వేరు సామాజిక సమస్యలపైనా పనిచేసిన ఢల్లీి వసంత్‌, జులై 7న మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో జాయిన్‌ అయ్యారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 115 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కె.మాణిక్‌ రావునే మరోసారి జహీరాబాద్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో… ఢల్లీి వసంత్‌, తన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆ తర్వాత కూడా అధిష్టానాన్ని ఆకట్టుకోవడానికే వసంత్‌ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ పలు సామజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధిష్టానం మాత్రం, మాణిక్‌ రావు ను ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశం లేదని ప్రకటించడనీతో, తప్పని పరిస్థితుల్లో వసంత్‌ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి మరొక బలమైన పార్టీని వెతుక్కోవలిసిన పరిస్థితి ఏర్పడిరది.బీజేపీ నాయకుల మధ్యవిభేదాలతో గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జంగం గోపి పార్టీని వీడటంతో… జహీరాబాద్‌ లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థి లేరు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సొంత తమ్ముడైన దామోదర రాంచందర్‌ కూడా ఆరునెలల కిందనే బీజేపీలో చేరారు. కానీ తనకు కూడా ఈ నియోజకవర్గంలో గట్టి పట్టులేకపోవటం తో బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వేటలో ఉంది. ఇద్దరి అవసరాలు ఒక్కటే అవడంతో… వసంత్‌ కి ఒక బలమైన పార్టీ నుంచి పోటీ చేయాలనీ చూస్తుండడం, బీజేపీ కూడా నియోజకవర్గంలో పట్టున్న నాయకుని కోసం చూస్తుంది. సోమవారం లేదా మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో ఢల్లీి వసంత్‌ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు అంటున్నారు. ఇదే జరిగితే వసంత్‌ మూడు నెలలోపే రెండోసారి పార్టీ మారినట్లవుతోంది. బీజేపీకి మాత్రం, తమ పార్టీ నుంచి పోటీలోకి దించడానికి ఒక బలమైన అభ్యర్థి దొరినట్టేనని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *