ఏపీలో ముందస్తు అడుగులు

విజయవాడ, జూలై 6
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రలో వైకాపా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయా? ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తాము కూడా ఎన్నికల బరిలోకి దిగనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఢల్లీి పర్యటన ‘ముందస్తు’ సంకేతాలను ఖాయం చేసిందని చెబుతున్నాయి. ఢల్లీి పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం జగన్‌ తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. అక్కడ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. తర్వాత మోదీని కలిసిన జగన్‌ దాదాపు గంటన్నర వివిధ విషయాలపై చర్చించారు. పోలవరం, రాష్ట్రానికి నిధులు, పెండిరగ్‌ పనులు వంటివన్నీ చర్చించినట్లు బయటకు చెబుతున్నా ముందస్తు ఎన్నికలపై కూడా ఇద్దరి నేతల మధ్యా చర్చ జరిగినట్లు జాతీయ విూడియా పేర్కొంటోంది.ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే భాజపా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పూర్తిగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని భాజపా శ్రేణులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ లోగా ఉమ్మడి పౌరస్మృతిని పార్లమెంట్‌లో ఆమోదించి ఎన్నికలకు వెళ్లాలని భాజపా అధినాయకత్వం భావిస్తోంది. దీనివల్ల మళ్లీ హిందూ ఓట్లను పూర్తి స్థాయిలో సంపాదించుకోవచ్చని భావిస్తోంది. ఈ చట్టంపై కూడా లోక్‌సభలో, రాజ్య సభలో వైకాపా మద్దతు కోరినట్లు తెలిసింది. ఇక జగన్‌ కూడా ముందస్తుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హావిూలను 99.5 శాతం నెరవేర్చినట్లు ప్రకటించిన జగన్‌, ఆ విశ్వాసంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల అసంతృప్తిని తొలగించేలా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, సీపీఎస్‌ స్థానంలో గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌లాంటి ప్రకటనల ద్వారా జగన్‌ ఆ వర్గాల ఓట్లపై కూడా నమ్మకంగా ఉన్నారు. మునుపెన్నడూ, ఏ ముఖ్యమంత్రి చేయని స్థాయిలో ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చామని, తమ గెలుపు నల్లేరు విూద నడకేనని వైకాపా శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల రెండు ప్రముఖ విూడియా సంస్థలు తమ సర్వేల్లో ఆంధ్రలో వైకాపా అధికారంలోకి వస్తుందని ప్రకటించడం కూడా జగన్‌ నమ్మకానికి కారణమని తెలుస్తోంది. మొత్తం విూద కేంద్రం, రాష్ట్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ విషయం పై స్పష్టత రానుంది.
పార్టీలో కలవరం
షెడ్యూల్‌ ప్రకారమైతే.. ఏపీలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే రాజకీయ పార్టీల హడావిడి చూస్తుంటే.. రేపో, ఎల్లుండో ఎన్నికల వస్తాయి అన్నట్టుగా అనిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పినా.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పార్టీలు నమ్మడం లేదు. సీఎం జగన్‌ ఎన్నికల విషయంలో అబద్దాలు ఆడుతున్నారని జనసేన అధినేత పవన్‌ అంటున్నారు. ఈ ఏడాది చివరిలో ఎప్పుడైనా ఎన్నికలు రావడం ఖాయమని ఇటీవల ఓ సభలో చెప్పారు. ఎన్నికలపై ప్రతిపక్షాల హడావిడితో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికీ తోచిన విధంగా వారు సర్వేలు, ప్రకటనలు చేస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఏ విధంగా సర్వేలు చేస్తున్నారో తెలియదు కానీ.. ఏ పార్టీ విజయం సాధిస్తుందో, ఏ పార్టీ ఓడిపోతుందో లెక్కలతో మరీ ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఓ వైపు ప్రజలు, మరో వైపు పార్టీలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఓ సర్వే ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని తెలిపింది. అయితే ఇవి నిజమైన సర్వేలేనా అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా వచ్చిన సర్వేలను చూసి ఆ పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే.. మిగతా పార్టీలు ఆ సర్వేలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ సర్వేలతో ప్రతిపక్ష పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు…తనకంటూ సొంత ముద్ర వేసుకునేలా ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని, అలాంటప్పుడు ఆయన గెలుపు అసాధ్యమే అని అంటున్నారు. మరో వైపు బీజేపీతో కలవాలని టీడీపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికి.. కాషాయ పార్టీ మాత్రం దూరంగా జరుగుతూ వస్తోంది. దీనికి తోడు జనసేన, టీడీపీల పొత్తులు ఇంకా కుదరలేదని సమాచారం. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం చేసుకుంటున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది. అప్పటి వరకు అనేక మార్పులు, రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *