మహిళలే మహారాణులు

మెదక్‌, అక్టోబరు 7
సిద్ధిపేట జిల్లాలో మొత్తం 9,25,398 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళల ఓట్లు 4,68,140 ఉన్నాయి.పురుషుల ఓట్లు 4,57,178 మాత్రమే ఉన్నాయి.సిద్దిపేట జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే ఆధిపత్యం ఉంది.సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 2,28,523 ఓట్లు ఉండగా, వారిలో పురుషుల ఓట్లు 1,12, 938 ఉంటే మహిళా ఓటర్లు 1,15,520.. ఇతరులు 69 మంది , ప్రవాస ఓటర్లు ఐదుగురు, సర్వీస్‌ ఓటర్లు 107 మంది ఉన్నారు.దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,94,664 ఓటర్లు ఉన్నారు.వారిలో పురుష ఓటర్లు 95,305 ,మహిళా ఓటర్లు 99,359 , ప్రవాస ఓటర్లు మూడు, సర్వీస్‌ ఓటర్లు 57 మంది ఉన్నారు.గజ్వేల్‌ నియోజకవర్గంలో మొత్తం, 2,65, 636 ఓటర్లు ఉన్నారు. వారిలో, పురుషులు 1,31,774 , మహిళలు 1, 33, 855 ఉండగా, ప్రవాసులు ఇద్దరు, సర్వీస్‌ ఓటర్లు 72 మంది ఉన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 2,36, 575 ఓటర్లు ఉండగా, పురుషులు 1, 17,165, మహిళలు 1,19, 406, ఇతరులు నలుగురు, ప్రవాసులు 9, సర్వీస్‌ ఓటర్లు 214 మంది ఉన్నారు.
మెదక్‌ జిల్లాలో…
మెదక్‌ జిల్లాలో మొత్తం 4,34,275 మంది ఓటర్లు ఉన్నారు . అందులో పురుషులు 2,09, 927, మహిళలు 2,24, 337, ఇతరులు 11, ప్రవాసులు 9, సర్వీస్‌ ఓటర్లు 124 మంది ఉన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో మొత్తం 2, 14,064 ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1,02,340, మహిళా ఓటర్లు 1,11, 720, ఇతరులు 4 ఉన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో 2,20,211 ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,07, 584, మహిళలు 1,12,617, ఇతరులు 11మంది ఉన్నారు.సంగారెడ్డి జిల్లాలో పురుష ఓటర్లే అధికం…
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,55, 958 ఓటర్లు ఉన్నారు.అందులో పురుషులు 6,83,076, మహిళలు 6,72,757,ఇతరులు 74,సర్వీసు ఓటర్లు 354మంది ఉన్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో మొత్తం 2,27,232మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,14,570 ,మహిళలు 1,12,654, ఇతరులు 8 సర్వీసు ఓటర్లు 67మంది ఉన్నారు.అందోల్‌ నియోజక వర్గంలో మొత్తం 2,44,710మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,20,572,మహిళలు 1,24,133 ఇతరులు 5, ప్రవాసులు 5,సర్వీసు ఓటర్లు 48మంది ఉన్నారు.జహీరాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 2,64,732 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,33, 312, మహిళా ఓటర్లు 1,31,419 , ప్రవాసులు 3, సర్వీస్‌ ఓటర్లు 103 మంది ఉన్నారు.సంగారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2,38, 336 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,18,265 , మహిళా ఓటర్లు 1,20,037 , ఇతరులు 34, ప్రవాసులు 10, సర్వీస్‌ ఓటర్లు 66 మంది ఉన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం 3,80,948 మంది ఓటర్లు ఉన్నారు, అందులో పురుషులు 1,96, 357, మహిళలు 1,84, 504 , ఇతరులు 77, ప్రవాసులు 56, సర్వీస్‌ ఓటర్లు 70 మంది ఉన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *