సైతాన్ ట్రైలర్ రిలీజ్.

ఓటీటీల‌కు సెన్సార్ లేక‌పోవడంతో వెబ్ సిరీస్‌ల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటోందనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు అది నిజమే అని ప్రూవ్ చేశాయి కూడా. తాజాగా అదే బాటలో ‘సైతాన్’ (Shaitan Web Series) అనే వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్ తో రానుందని తెలుస్తోంది. ఇది రానా నాయుడు వెబ్ సిరీస్ ని మించి ఉంటుందని తాజాగా విడుదల చేసిన సైతాన్ ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

వైఎస్సార్ బయోపిక్ యాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మహి వీ రాఘవ ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. జూన్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ ‘సైతాన్’ (Shaitan Web Series) స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేపడుతూ సోమవారం ఈ సిరీస్ నుంచి ట్రైలర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.అయ్య బాబోయ్! అన్నట్లుగా ఉన్నాయి ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు. ఇందులో ఉన్న బూతులని ఇంకే సిరీస్ లో కానీ మూవీలో కానీ విని ఉండరని చెప్పుకోవచ్చు. అంత పచ్చిగా లేడీ ఆర్టిస్టులే బూతులతో రెచ్చిపోతున్నారు. ఒక ఫ్యామిలీ దారుణంగా హత్యలు చేయడం ఇందులో చూపించారు. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ కి బోల్డ్ నెస్ యాడ్ చేసి ఈ సైతాన్ సినిమా తెరకెక్కించారని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ట్రైలర్ లాంచ్ లో ఈ మూవీ డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఇంటెన్స్ కథకి అలాంటి డైలాగ్స్ వాడాల్సి వచ్చిందని అన్నారు. ఇందులో న్యూడిటీ, అభ్యంతరక డైలాగులు అన్నీ ఉన్నాయని చెప్పారు. కాబట్టి అన్నింటికీ సిద్ధపడిన వారు మాత్రమే సైతాన్ సిరీస్ చూడండి అని కోరారు. పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర వంటి సినిమాల‌తో డీసెంట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న మ‌హి వి.రాఘ‌వ్ (Mahi V Raghav) రీసెంట్‌గా ఓటీటీలోకి అడుగు పెట్టారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లోనే ‘సేవ్ ది టైగర్స్’ (Save The Tigers) పేరుతో డీసెంట్ ఫ్యామిలీ సిరీస్‌ రూపొందించి ఇప్పుడు ‘సైతాన్’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *