45 మంది ఎమ్మెల్యేలపై జగన్‌ అసంతృప్తి

పార్టీలోని శాసనసభ్యులను నాలుగు వర్గాలుగా విభించి వారిని ఆయా వర్గాల వారీగా ట్రీట్‌ చేయాలని సీఎం జగన్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇందులో మొదటి కేటగిరి, సీట్‌ ఇస్తే గెలిచేవారు. రెండో ది సీట్‌ ఇస్తే ఓడిపోయేవాళ్లు, మూడోది సీట్‌ ఇవ్వకపోతే వేరే పార్టీలో చేరేవారు…నాలుగోది పార్టీ లోనే ఉండి నష్టం కలిగించేవారు. ఇలా నాలుగు రకాలుగా ఎమ్మెల్యేల విభజన చేపట్టి వారిని ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనిచేయించుకోవటం, లేదంటే ఎన్నికల సమయంలో పూర్తిగా పక్కన పెట్టటం వంటి పరిస్థితులపై జగన్‌ ఈ సమావేశంలో శాసనసభ్యులకు ప్రత్యక్షంగా పరోక్షంగా స్పష్టం చేయనున్నారని అంటున్నారు. తాజా సర్వేల ఆధారంగా ఎమ్మెల్యేలపై అంచనా చేసినట్లుగా చెబుతున్నారు. అందులో 45 మంది ఎమ్మెల్యేలపై జగన్‌ మోహన్‌ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని కూడా పార్టీలోని నాయకులు అంటున్నారు.వారి స్థానాల మార్పునకు జగన్‌ నిర్ణయించారని అంటున్నారు. ఇందులో భాగంగా సీట్‌ మార్పు శాసనసభ్యులకు జూన్‌ వరకు కొంత టైం ఇచ్చే అవకాశం కూడా లేకపోలుదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సర్వేల ఆధారంగా సమాచారం తెప్పించుకున్న జగన్‌ 30 మంది ఎమ్మెల్యేకు తిరిగి టిక్కెట్‌ ఇచ్చే విషయంలో డౌట్‌ గా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నారు.ఏప్రిల్‌ లో జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై ఒక నిర్ణయానికి వస్తానని గతంలోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. దీంతో ఈసారి సమావేశంలో ఎవరి భవిష్యత్‌ ఏంటనే దానిపై సీఎం ఓ క్లారిటీ ఇచ్చేస్తారంటున్నారు పార్టీ నేతలు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల పనితీరు పైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. సీఎం జగన్‌ దిల్లీ టూర్‌ తో కేబినెట్‌ లో మార్పులు తప్పవనే ప్రచారం తెర విూదకు వచ్చింది. అదే సమయంలో శాసనసభ్యులతో సమావేశంలో జగన్‌ దూకుడుగా నిర్ణయాలు ప్రకటించనున్నారు. ఇటీవల కాలంలో జగన్‌ గవర్నర్‌ తో సమావేశం ఆ తరువాత వరుసగా రెండు సార్లు దిల్లీ పర్యటన తరువాత పరిస్థితుల్లో మార్పులు స్పష్టంగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొదటి కేబినెట్‌ లో పనిచేసిన ఇద్దరికి తిరిగి అవకాశం ఇవ్వటంతో పాటుగా, కొత్తగా కొంతమందికి మంత్రి వర్గంలో చోటు ఇవ్వొచ్చని చర్చ జరుగుతుంది.ఏపీలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజలు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. అభ్యర్థుల పేరు ప్రతిష్టలతో సంబంధం లేకుండా జగన్‌ సృష్టించిన సునావిూలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందారు. రాష్ట్రంలో 151 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తౌెన తర్వాత ఎమ్మెల్యేలు వెనుదిరిగి చూసుకుంటే, చాలా మందికి చెప్పుకోడానికి ఏమి కనిపించడం లేదు.రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా అందరిని ముఖ్యమంత్రి నియంత్రణలో ఉంచుకున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఈ తరహా రాజకీయాలు సాధారణమే అయినా అంతకు మించిన ఆంక్షలు, వ్యూహాలను వైసీపీ అధినేత అమలు చేశారు. ప్రజా ప్రతినిధుల అవినీతిని ఊపేక్షించేది లేదని మొదట్లోనే స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు అప్పగించినా వాటిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఉన్నత స్థాయిలో అమోదం ఉంటే తప్ప అమలు చేయలేని పరిస్థితి కల్పించారు.ఏపీలో అధికార పార్టీకి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజా ప్రతినిధుల గెలుపు బాధ్యతలు తమవేనని ముఖ్యమంత్రి మొదట్నుంచి అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మొదట్లోనే అందరిని హెచ్చరించారు. పదవిలో ఉండగా సంపాదించుకోవాలనే ఆలోచనలు వదులుకోవాలని స్పష్టం చేశారు. ఇది ఎమ్మెల్యేలకు రుచించకపోయినా చేసేదేమి లేక కాలం నెట్టుకొచ్చారు. వాటి ఫలితాలు ఇప్పుడు అర్థమవ్వడంతో ఎమ్మెల్యేలు కలత చెందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *