ఔటర్‌ చుట్టూ రైల్వే ప్రాజెక్టు

హైదరాబాద్‌, జూన్‌ 29
హైదరాబాద్‌ కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి క్రేజీ ప్రాజెక్టును ప్రకటించారు. హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రైలు ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు సర్వే కోసమే రూ.14 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడిరచారు. ఇప్పటికే హైదరాబాద్‌ కు ప్రకటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాటు ఈ ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు వల్ల హైదరాబాద్‌కు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా రైల్వే ప్రాజెక్ట్‌ ఉంటుందని అన్నారు.ఈ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిది అని కిషన్‌ రెడ్డి చెప్పారు. రైలు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఔటర్‌ రైలు లైన్‌ ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. దాదాపు 350 కిలో విూటర్ల ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు రాష్ట్రంలోని చాలా జిల్లాలను కలుపుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.26 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. భూసేకరణకు 50 శాతం ఖర్చు కేంద్రమే భరించడానికి రెడీగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని అన్నారు. ఇందులో భాగంగా భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించామని అన్నారు. రైలు మార్గం ఎలా ఉండాలనే దానికి 99శాతం ఆమోదం లభించిందని చెప్పారు. ఓఓుూ రెండో దశలో భాగంగా దీనిని పూర్తి చేయాలని చెప్పామని అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు రూ.330 కోట్ల కేటాయింపుతో పాటు, కేంద్ర నిధులతో ఘట్‌కేసర్‌`రాయగిరి వరుకు ఎంఎంటీఎస్‌ రైలు ఏర్పాటు చేయనున్నారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కూడా కిషన్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడి మార్పు ఏవిూ ఉండబోదని, అలాంటి నిర్ణయాలు అధిష్ఠానం తీసుకోలేదని చెప్పారు. ఈ అంశంలో ఎవరూ గందరగోళంలో లేరని, విూడియానే వార్తలు ప్రసారం చేస్తూ గందరగోళం సృష్టిస్తుందని అన్నారు. ఇలాంటి వార్తలు ఎందుకు వచ్చాయో తమకు తెలియదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలలు మాత్రమే ఉన్నందున కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం లేదని, ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అధిష్టానం ఎలాంటి మార్పులు చేయబోదని కిషన్‌ రెడ్డి చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *