ముద్రగడకు లైన్‌ క్లియర్‌… అయినట్టేనా

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఇన్నాళ్ళు తుని రైలు దగ్ధం కేసు ఉంది. 2016లో తుని దగ్గర రైలు తగలబెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది. ఆ కేసును ఇటీవల కోర్ట్‌ కొట్టేయడంతో తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్‌ అవ్వాలనుకుంటున్నారు ఆయన. ముద్రగడ చివరిసారిగా 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అంతకు ముందు సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా? 2004లో అక్కడ ఓటమితో ఇక జీవితంలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయబోనని బీష్మించుకు కూర్చున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా ఏ పార్టీ వైపు చూడలేదు ఆయన. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ఓపెన్‌ ఆఫర్లు వచ్చినా కేసు కొట్టేసిన తర్వాతేనని చెబుతూ వచ్చారట. ఇప్పుడు ఆ మేటర్‌ క్లియరైనందున తిరిగి యాక్టివ్‌ అవడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారట. మనసులో మాట చెప్పకపోయినా? టిడిపి, జనసేనల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న స్థితిలో అటువైపు చూసే అవకాశం లేదు. అంతిమంగా ఆయన ఫ్యాన్‌ కింద సేదదీరడానికే సిద్ధమవుతున్నారట.వైసీపీలో తనతో పాటు చిన్న కుమారుడు గిరిబాబు కూడా సీటు ఇవ్వాలని గతంలో డిమాండ్‌ పెట్టారు ముద్రగడ పద్మనాభం.. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కొడుకుని మాత్రం ఎన్నికల్లో పోటీ చేయిస్తే చాలని అనుకుంటున్నారు ఆయన. ప్రత్తిపాడులో తాను పోటీ చేయనని ఇప్పటికే చెప్పాను కాబట్టి కుటుంబ సభ్యులను కూడా అక్కడకు పంపకూడదని అనుకుంటున్నారట.. 2009లో ట్రయాంగిల్‌ ఫైట్‌ కారణంగా పిఠాపురంలో స్వల్ప తేడాతో ఓడిపోయారు ముద్రగడ. అందుకే.. గిరిబాబును అక్కడి నుంచే బరిలో దింపే ఆలోచన ఉందట. కానీ?పార్టీలోకి రమ్మని ఆహ్వానించే వరకు ఓకేగానీ? సీటు విషయంలో స్పష్టమైన హావిూ ఇచ్చే ఉద్దేశ్యంలో లేదట వైసీపీ. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రం మొత్తం విూద కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి? ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి పెండెం దొరబాబు ఉన్నారు.. గతంలో ఇక్కడి నుంచే పీఆర్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్లు చూసుకుని? సాధ్యా సాధ్యాలను పరిశీలించాకే చెబుతామని ముద్రగడకు వర్తమానం అందినట్టు చెప్పుకుంటున్నారు. గట్టి పోటీ ఇచ్చి జయాపజయాలను ప్రభావితం చేయగల అభ్యర్థి కోసమే వైసీపీ వెదుకుతోందన్నది పార్టీ వర్గాల మాట. పార్టీ ఇమేజ్‌తో సంబంధం లేకుండా వ్యక్తిగత కరిష్మా ఉన్న అభ్యర్ధులవైపు మొగ్గుతోందట వైసీపీ. అందుకే.. ఒకవేళ ముద్రగడ కుమారుడికి సీటు ఇవ్వడం సాధ్యం కాకుంటే?వేరే విధంగా న్యాయం చేస్తామని చెప్తోంది వైసీపీ నాయకత్వం.మొత్తానికి పొలిటికల్‌ స్క్రీన్‌ పై మళ్ళీ కనిపించడానికి ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం. వైసీపీ కూడా ఆయనకు ఎర్ర తివాచీ పరిచినట్టే పరిచి ప్లస్‌లు, మైనస్‌ల లెక్కలు వేస్తోంది. పద్మనాభం కూడా తనకంటే? కుమారుడి రాజకీయ భవిష్యత్‌ ముఖ్యం కనుక ఏదో రూపంలో అతన్ని బరిలో దింపి పొలిటికల్‌గా సెట్‌ చేయాలని చూస్తున్నారట. పద్మనాభం ప్రయత్నాలు?వైసీపీ కూడికలు, తీసివేతలు అంతిమంగా ఎలాంటి రిజల్ట్‌ ఇస్తాయో చూడాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *