కేశినేని, గల్లాకు అడ్డుపడుతున్న స్థానికులు

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాజకీయాల్లో తలపండిన కుటుంబాలు సయితం టైం బాగోలేకపోతే వాటిని వదిలేసుకోవాలి.. ఇప్పుడు గల్లా కుటుంబం పరిస్థితి కూడా అలాగే ఉంది. గల్లా అరుణ కుమారి తాను రాజకీయాలకు ఇక దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఆయన కుమారుడు గల్లా జయదేవ్‌ ప్రస్తుతం టీడీపీ గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ దక్కడం అనుమానంగానే కన్పిస్తుంది. దశాబ్దాల పాటు… గల్లా కుటుంబం రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పింది. చిత్తూరు జిల్లాలో అయితే గల్లా అరుణ కుమారి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా హవా చలాయించారు. కానీ వచ్చే ఎన్నికలలో గల్లా కుటుంబం రాజకీయాలకు దూరమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. గల్లా కుటుంబానికి వ్యాపారాలున్నాయి. పారిశ్రామికవేత్తలుగా వారు రాణించారు. రాజకీయాల్లో అనేక విజయాలు సాధించినా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారికి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. జయదేవ్‌ ఎంపీగా ఉన్నా.. 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకు గల్లా జయదేవ్‌ గెలిచారు. అయితే ఆయన పెద్దగా నియోజకవర్గంలో పర్యటించరు. ప్రజలకు దూరంగా ఉంటారు. పార్టీ క్యాడర్‌ తో కూడా గల్లా జయదేవ్‌ కలివిడిగా ఉండరు. గడిచిన మూడేళ్ల కాలంలో అడపా దడపా తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నది లేదు. విదేశీ పర్యటనలు, వ్యాపారాలను చూసుకోవడంతోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతారన్న టాక్‌ వినపడుతుంది. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఢల్లీిలో కనపడతారు దీంతో పార్టీ హైకమాండ్‌ కు గల్లా జయదేవ్‌ కు మధ్య గ్యాప్‌ బాగా వచ్చిందంటున్నారు. తప్పించాలని…. దీంతో ఇటీవల గుంటూరు టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్‌ కు టిక్కెట్‌ ఇవ్వవద్దని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఆ ప్రభావం తమపై పడుతుందని వారు అధినేత వద్ద ఆందోళన చెందినట్లు సమాచారం. చంద్రబాబు కూడా గల్లా జయదేవ్‌ పనితీరును అంచనా వేస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలోనూ జయదేవ్‌ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. అయితే ఆర్థికంగా బలమైన నేత కావడంతో వేరే చోట జయదేవ్‌ కు టిక్కెట్‌ ఇవ్వాలా? లేదా? అన్నది చంద్రబాబు ఆలోచిస్తున్నారని సమాచారం. గుంటూరు నుంచి మాత్రం గల్లా జయదేవ్‌ ను తప్పిస్తారన్నది మాత్రం వాస్తవం.
బెజవాడలోనూ అంతే
కేశినేని నాని రెండు దఫాలు టీడీపీ నుంచి విజయం సాధించారు. వరస విజయాలు వెనక ఆయన కన్నా పార్టీకున్న ఓటు బ్యాంకే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వ్యాపారాలన్నీ మూసివేసుకున్న తర్వాత కేశినేని నాని ఫక్తు రాజకీయ నేతగా మారారు గతంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, గద్దె రామ్మోహన్‌ లాంటి వంటి వారు ఉన్నా కృష్ణా జిల్లాలో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తలేదు. వారు అందరినీ కలుపుకుని పోయేవారు. కానీ కేశినేని నానిని దాదాపు ఎక్కువ మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వల్ల అనేక శాసనసభ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గ్రూపులుగా తయారైంది.దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కేశినేని నానిని తప్పించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే నానిని అసహనానికి గురయ్యేటట్లు చేశారు. పార్టీ నాయకత్వం అందులో సక్సెస్‌ అయిందనే చెప్పాలి. కేశినేని నాని స్వచ్ఛందంగా తప్పుకుంటే విజయవాడలో పార్లమెంటు అభ్యర్థులకు కొదవ లేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు పోటీ పడతారు. గెలిచే సీటు కావడంతో సహజంగానే ముందుకు వస్తారు. అయితే ఈసారి ఎవరికీ ఇబ్బందిలేని నేతను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పెద్దగా పార్లమెంటు నియోజకవర్గాన్ని పట్టించుకోక పోయినా పరవాలేదు కాని, ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే ఉండకూడదన్నది చంద్రబాబు ఆలోచన.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *