అంతుచిక్కని కమల వ్యూహం….

భారతీయ జనతా పార్టీ అంతరంగం అంతుచిక్కడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి వైఖరి సొంత పార్టీ శ్రేణులను విస్మయ పరుస్తోంది.తెలంగాణలో దూకుడుగా ఉన్న బండి సంజయ్‌ నాయకత్వాన్ని మార్చారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈటెల రాజేందర్‌ కు సైతం కీలక పదవి ఇచ్చారు. గతం కంటే బిజెపి పరిస్థితి మెరుగుపడిరదా? అంటే అది కనిపించడం లేదు. ఎన్నికల సవిూపించే కొద్దీ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతోంది. ఇక ఏపీలోనూ అదే పరిస్థితి. అదే కన్ఫ్యూజన్‌. రెండు చోట్ల అధికార పార్టీతో లోపయికారీ ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో బండి సంజయ్‌ మార్పు తర్వాత అద్భుతాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. అధికార బి ఆర్‌ ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌ నుంచి బడా నేతలు క్యూ కడతారని ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు నెలలు అవుతున్నా ఒక్కడంటే ఒక్క పెద్ద నేత సైతం చేరలేదు. గ్రౌండ్‌ లెవెల్‌ లో ఇతర పార్టీలో అవకాశం దక్కని వారు మాత్రమే బిజెపిలోకి వస్తున్నారు. అన్నింటికీ మించి బిజెపి నుంచి కీలక నాయకులు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం తెలంగాణలో రెండో స్థానం వస్తాది అనుకున్నారు.. కానీ కనీసం మూడో ప్లేస్‌ లో ఎక్కడ ఉంటుందో తెలియని స్థితిలో బిజెపి ఉంది. ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల కోసం ఓ జుంబో కమిటీని ఏర్పాటు చేశారు.వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి కీలక నాయకులు, కేంద్ర మంత్రులతో బిజెపి హై కమాండ్‌ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరు, అభ్యర్థుల ఎంపిక, ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ వంటి వాటిపై ఈ కమిటీ దృష్టి పెట్టనుంది. ఏపీ నుంచి బిజెపి మాజీ అధ్యక్షుడు సోమ వీర్రాజుకు ఈ కమిటీలో స్థానం దక్కడం విశేషం. అటు కర్ణాటక, తమిళనాడు, గోవాల నుంచి బిజెపి నాయకులకు ఈ కమిటీలో స్థానం దక్కింది. తెలంగాణ ఎన్నికల కమిటీలు ఇతర రాష్ట్రాల నాయకులకు చోటు ఇవ్వడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ ని తప్పించారు. ఆయన హయాంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతం అయిందని ఒక టాక్‌ ఉండేది. వచ్చే ఎన్నికల్లో అధికారానికి వచ్చే అవకాశం ఉందని.. లేకుంటే ప్రధాన పత్రి పక్ష స్థానం అయినా దక్కే ఛాన్స్‌ ఉందని టాక్‌ నడిచింది. కానీ అనూహ్యంగా బండి సంజయ్‌ ను తప్పించి జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజును తప్పించారు. ఆయనకు మాత్రం మొండి చేయి చూపారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిటీలో సోము వీర్రాజుకు తీసుకున్నారు. బండి సంజయ్‌ ను ఎలా వినియోగించుకుంటారో తెలియడం లేదు. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతొందని విశ్లేషణలు వెలువడుతున్నాయిప్రధాని సమావేశానికి గైర్హాజరైన వారిలో ఆదిలాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జీ వివేక్‌ వెంకటస్వామి, ఎం విజయశాంతి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జీ విజయరామారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు.మోదీ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు జీ లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరికొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు.ప్రధానమంత్రి సమావేశానికి ఇతర సీనియర్‌ నేతలు గైర్హాజరు కావడం ఖచ్చితంగా పార్టీకి తప్పుడు సంకేతాన్ని పంపిందని తెలంగాణ బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు. బాపురావు త్వరలో కాంగ్రెస్‌లోకి మారే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. మోదీ పర్యటన సందర్భంగా అతడిని సంప్రదించడానికి ప్రయత్నించామని, కానీ అతను పార్టీకి అందుబాటులో రాలేదని అతని అనుచరులు కూడా సమావేశానికి రాలేదన్నారు. అటు ఏపీలోనూ ఎన్నికలు సవిూపిస్తున్న కొద్దీ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఊహించని రీతిలో అరెస్ట్‌ కావడం, ఆ తర్వాత జైలుకి వెళ్లడంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొత్తుల ప్రకటన చేయడంతో ఏపీ రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారిపోయాయి. అంతకుముందు చంద్రబాబు`పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయినప్పటికీ పొత్తులపై ఎన్నికలప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెప్పుకుంటూ వచ్చారు. అప్పటివరకూ రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యం అంటూ ఇరువురు నేతలు చెప్పుకొచ్చారు. దీంతో ఎవరికి వారే ఆయా పార్టీల తరపున కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ మాత్రం బీజేపీతో పొత్తు విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా.. బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతోనే పొత్తులో ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారు. టీడీపీతో పొత్తు ప్రకటన సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ కూడా బీజేపీ కలిసొస్తుందో.. లేదో.. చెప్పలేనని కూడా స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *