ఈడీ అంటూ కలరింగ్‌… సీన్‌ కట్‌ చేస్తే

నెల్లూరులో ఓ నగల దుకాణంలో రాబరీ జరిగింది. ఈడీ అధికారులమంటూ కలరింగ్‌ ఇచ్చిన దుండగులు.. షాపులో చొరబడ్డారు. తనిఖీ చేసేందుకు బంగారం కావాలంటూ బ్యాగ్‌ నింపుకున్నారు. వీరి వ్యవహారంపై డౌట్‌ వచ్చిన షాప్‌ నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని దుండగులను పట్టుకున్నారు. నెల్లూరు నగరంలోని కాకర్లవారి వీధిలో ఉన్న ఓ జ్యూవెలరీ షాపుకు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. వారిలో ఇద్దరు వ్యక్తులు పోలీస్‌ యూనిఫామ్‌ లో ఉన్నారు. వాళ్లు షాపులోకి వచ్చీ రాగానే షట్టర్‌ క్లోజ్‌ చేశారు. సిబ్బంది వద్దకు వెళ్లి తాము ఈడీ అధికారులమని, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇక్కడకు వచ్చామని నమ్మించారు. వారిలో రమేష్‌ అనే వ్యక్తి సుమారు 40 నిముషాల పాటు తనిఖీ చేస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. బంగారం, నగదు బ్యాగ్‌ లో వేసుకున్నారు. వీరి తీరుతో అనుమానం వ్యక్తం చేసిన వ్యాపారులు వారు బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే నగల దుకాణం వద్దకు చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమై నకిలీ ఈడీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారిలో పుట్టపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు, కర్నూలుకు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌ కు చెందిన ఒకరు ఉన్నారు. దుకాణాన్ని తనిఖీ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఈడీ అధికారులమంటూ వచ్చిన దుండగులు.. తమతో పాటు బంగారం తీసుకెళ్లాలని చెప్పడంతో అనుమానం వచ్చిందని దుకాకణ యజమాని తెలిపారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని, వెంటనే వెళ్లి అక్కడున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. పోలీస్‌ యూనిఫామ్‌ లో ఉన్న వ్యక్తి వద్ద నుంచి నకిలీ తుపాకి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడిరచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *