ఆందోళనకు సిద్ధమౌతున్న టీడీపీ

పోలవరం నిర్మాణ పనుల్లో ఎక్కడా పురోగతి లేదని, హెడ్‌ వర్క్స్‌ లెఫ్ట్‌ కెనాల్‌, రైట్‌ కెనాల్‌ ఎక్కడా పనులు ముందుకు వెళ్లలేదని మాజీ ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను నట్టేట ముంచారని, రైట్‌ కెనాల్‌ విూద ఇంకో లిఫ్టు పెట్టి పోలవరం డ్యామ్‌ కాస్త పోలవరం బ్యారేజ్‌గా చేసి, ప్రాజెక్టును రిజర్వాయర్‌ గా 41.15 విూటర్లు లేకుంటే 135 అడుగుల ఎత్తుకు పరిమితం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయి రెండేళ్లు అయినా, ఇంతవరకు డిజైన్లు ఫైనల్‌ అవ్వలేదని డిడిఆర్సీ, ఐఐటి హైదరాబాద్‌, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ వీళ్ళందరూ వచ్చి చెప్పేవరకు ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రులు ఉన్నారని, ముఖ్యమంత్రి పోలవరం గురించి మాట్లాడటమే మానేశాడని, జగన్‌ ఎన్ని సార్లు ప్రధానమంత్రిని ఆర్థిక మంత్రిని సంబంధిత జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఏమి విజ్ఞప్తి చేశారని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో ప్రతి రూపాయి కూడా కేంద్రం నుంచి తెచ్చుకునే అవకాశం ఉందని, చంద్రబాబు నాయుడు నాబార్డ్‌ క్రింద ఖర్చు పెట్టిన డబ్బులు 13500 కోట్లు వచ్చాయని, ఆ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన డబ్బు దేనికి ఖర్చు పెట్టారని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6వేల కోట్లు వచ్చాయని, నిర్వాసితులకు ఇళ్లు కట్టారా, డామ్‌ సైట్లో పనులకు కట్టారా లేదా లిక్కర్‌ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చారా అని ప్రశ్నించారు.ఏపీలో పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుని నాశనం చేసి, అమరావతిని చంపేశారని ఆరోపించారు. నిర్వాసితులకు ఇస్తానన్న పది లక్షలు ఇవ్వలేదని, ఐదు లక్షలు ఇవ్వలేదని, రూ.500 కోట్లు ఇస్తామని జీవోలో చెప్పినా డబ్బులు వాళ్లకు వెళ్లలేదని ఆరోపించారు. అన్ని విధాలుగా పోలవరం ప్రాజెక్టుని ముంచేసిన జగన్‌ చరిత్రలో పోలవరం ద్రోహిగా మిగిలిపోతాడన్నారు.ప్రాజెక్టులో ఏ పనులు కూడా ముందుకు వెళ్లడం లేదని, సంవత్సరానికి మూడు పర్సంటేజీ పనులు చేయలేని అసమర్ధ ప్రభుత్వం పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుని పూర్తి చేస్తుందా అని ప్రశ్నించారు. సిఎంగా జగన్మోహన్‌ రెడ్డి ఇంకా ఎన్ని నెలలు నువ్వు అధికారంలో ఉంటారన్నారు. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అంజయ్య గారనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. పోలవరం మల్టీపర్పస్‌ ఇరిగేషన్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టును నాశనం చేసి చరిత్రహీనుడిగా జగన్మోహన్‌ రెడ్డి మిగిలిపోయారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *