ముందస్తుపై క్లారిటీ ఇచ్చిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం జగన్‌ ఇటీవల హస్తిన పర్యటనకు వెళ్లిన సమయంలో ముందస్తు ఎన్నికల ప్రచారాలు రాష్ట్ర రాజకీయాల్లో హల్‌చల్‌ చేశాయి. సీఎం జగన్‌ ముందస్తుకు వెళ్లబోతున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము రెడీగా ఉన్నామని ప్రతిపక్షాలు నిత్య ప్రకటనలు చేస్తున్నారు. త్వరలోనే సీఎం జగన్‌ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లబోతున్నారంటూ గాసిప్పులు కూడా వైరల్‌ అయ్యాయి. అయితే తాజాగా ఇవాళ జరిగిన కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ ఈ విషయంపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.సీఎం వైఎస్‌ జగన్‌ తన మంత్రి వర్గంతో సుమారు గంట పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగుతున్న ప్రచారంపై మంత్రులతో సీఎం జగన్‌ మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్‌ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల కోసం ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులకు సీఎం జగన్‌ సూచించారు. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం అంతా కూడా రాజకీయమేనని సీఎం జగన్‌ అన్నారు. ప్రతిపక్షాల ప్రచారాలను వైసీపీ శ్రేణులు పట్టించుకోవద్దని, మరో 9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, కష్టపడితే మళ్లీ అధికారం మనదే అనిన మంత్రి సీఎం జగన్‌ అన్నట్టు సమాచారం. అలాగే ఇటీవల తెలుగు దేశం పార్టీ మహానాడు వేదికగా విడుదల చేసిన మినీ మేనిఫెస్టో విషయంలో స్పందించవద్దని మంత్రులకు సీఎం జన్‌ సూచించారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ముందస్తుపై స్పందించిన విషయం తెలిసిందే. ప్రజాతీర్పుకు తాము లోబడి ఉంటామని, ప్రజలు తమకు ఇచ్చిన ఐదేళ్లూ పరిపాలన కొనసాగిస్తామని, తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం పట్టలేదని స్పష్టత ఇచ్చారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులపై వస్తున్న ప్రచారంపై కూడా సీఎం జగన్‌ స్పందించినట్లు సమాచారం. ఎంతమంది కలిసి వచ్చినా తాము సింగిల్‌గానే పోటీ చేస్తామని సీఎం జగన్‌ మరో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *