కాంగ్రెస్‌ గూటికి చంద్రశేఖర్‌

వికారాబాద్‌, జూన్‌ 28
వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్‌ ఏ చంద్రశేఖర్‌ రికార్డు సృష్టించారు. మొదటిసారి 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన చంద్రశేఖర్‌, వికారాబాద్‌ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అనంతరం 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభ సమయంలో కేసీఆర్‌ పిలుపుతో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చి 2004 సాధారణ ఎన్నికల్లో కూడా గెలిచి, వరుసగా 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో దివంగత సీఎం రాజశేఖర్‌ రెడ్డి హాయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.తెలంగాణ వ్యూహంలో భాగంగా 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. డాక్టర్‌ ఏ చంద్రశేఖర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2018లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేసిన ఏసీఆర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ మధ్య పోటీలో ఓటమిపాలయ్యారు. కేవలం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఓడిరచాలనే ఉద్దేశంతోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని నాడు ఏసీఆర్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. అనంతరం చేసేది లేక 2021లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు.ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ఏసీఆర్‌, పార్టీలో ఉన్నా లేనట్లేనా? అన్నట్లుగా చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ పార్టీలో కొనసాగుతున్నా కేవలం నామమాత్రంగా మాత్రమే పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని చర్చలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రస్తుత బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ తప్ప మరో పార్టీ లేదు అనే టాక్‌ రావడంతో ఆ పార్టీలో చేరిన ఏసీఆర్‌ కఫ్యూజన్‌లో పడ్డాడు అనే చర్చ నడుస్తోంది. 2021లో కాంగ్రెస్‌ తెలంగాణాలో భూస్థాపితం అవుతుంది అనేలా సంకేతాలు వచ్చినా, ప్రస్తుతం రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుంది.పైగా రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై ప్రజల్లో సెంటిమెంట్‌ ఉంది. మరోపక్క సీఎం కేసీఆర్‌ పాలనపై వ్యతిరేకత కూడా రోజు రోజుకు పెరుగుతుండడంతో చంద్రశేఖర్‌ చూపు కాంగ్రెస్‌పై పడిరదనే టాక్‌ వినిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో కూడా మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌ పార్టీని వీడకుండా, అధికార పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లకుండా నమ్మకంగా ఉన్న కారణంగా ఈ సారి వికారాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌నే అధిష్టానం ఫైనల్‌ చేసింది.దాంతో ఏసీఆర్‌ ఈసారి ప్రసాద్‌ కుమార్‌ను డిస్ట్రబ్‌ చేయకుండా ఆనయ గెలుపు సహకరిస్తూ మరో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నాడని, త్వరలోనే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నాడనే చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా లేదా మరో చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది. ఇదిలా ఉంటే తన ప్రధాన శత్రువు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడిరచడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న ఏసీఆర్‌, ఆ లక్ష్యం నెరవేరాలంటే ఏ పార్టీలో ఉండాలి అనే అంశంలో సతమతం అవుతున్నారని టాక్‌. మరి ఇంతకు మాజీ మంత్రి చంద్రశేఖర్‌ దారి ఎటు? అయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *