50 మంది రిస్క్‌ లో ఉన్నట్టే

రాజకీయాల్లో ప్రత్యర్ధులని తక్కువ అంచనా వేయకూడదు..ఎవరికి ఎంత బలం ఉందో ఎవరు చెప్పలేం..కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతని ఫాలో అవ్వాల్సిందే?అలా కాకుండా చిన్న పాము కదా ఏం చేస్తుందనుకుంటే అసలుకే మోసం వస్తుంది. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ?ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీని కాస్త తక్కువ అంచనా వేస్తున్నట్లే కనిపిస్తోంది?వైసీపీ నేతలు ఎవరు మాట్లాడినా టీడీపీ చాప్టర్‌ క్లోజ్‌ అని, బాబు వయసు అయిపోయిందని, జనమంతా జగన్‌ వైపే ఉన్నారని అంటున్నారు.కానీ ఇదే కాన్ఫిడెన్స్‌తో ముందుకెళితే వైసీపీకి పెద్ద దెబ్బ తగులుతుంది?బాబుకు వయసు విూద పడుతుందేమో గాని?ఆయన ఆలోచనలకు మాత్రం కాదనే చెప్పాలి?అలాగే దాదాపు 35 శాతం పైనే ఓటు బ్యాంక్‌ కలిగి, బలమైన కార్యకర్తల బలం ఉన్న టీడీపీని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. అదే సమయంలో పవన్‌ కల్యాణ్‌ని తక్కువ అంచనా వేయడం కూడా రిస్కే అని చెప్పొచ్చు. అసలు వైసీపీ నేతలు?పవన్‌ని పెద్దగా లెక్కలో తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు.గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు..అలాగే జనసేనకు ఒకటే సీటు వచ్చింది?అంటే అదే ఇంకా జనసేన బలమని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. నెక్స్ట్‌ 2 చోట్ల కాదు కదా?20 చోట్ల పోటీ చేసినా పవన్‌ గెలవరని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే చంద్రబాబుతో కలిసి వచ్చిన సరే జగన్‌ని ఏం చేయలేరని మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా వైసీపీ నేతల ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అని చెప్పొచ్చు.
నిజానికి సింగిల్‌ గా పవన్‌ పూర్తి స్థాయిలో సత్తా చాటకపోవచ్చు?కానీ ఆయన?చంద్రబాబుతో కలిస్తే జగన్‌కు రిస్క్‌ ఎక్కువ. టీడీపీ`జనసేన గాని కలిసి పోటీ చేస్తే..దాదాపు 50 మంది పైనే వైసీపీ ఎమ్మెల్యేలు ఓటమి అంచుకు చేరుకున్నట్లే?ముఖ్యంగా విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు పవన్‌ వల్ల రిస్క్‌ ఎక్కువ. కాబట్టి పవన్‌ని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తపడితే బెటర్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *