టైటిల్ వచ్చింది… గిప్పడి సంది ఖేల్ అలగ్!
నందమూరి బాలకృష్ణ (Bala Krishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి (Anil Raavipudi) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకుక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య 108 (Nbk 108)వ చిత్రంగా షైన్ స్ర్కీన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ (Bhagavanth kesari) టైటిల్ ఖరారు చేశారు. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురువారం చిత్ర బృందం టైటిల్ను ప్రకటించింది. పోస్టర్ చూస్తుంటే బాలయ్య ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపిస్తున్నారు. కొత్త హెయిర్ స్టైల్, చేతిలో కొత్త ఆయుధంతో బరిలో దిగారు బాలయ్య. ఇప్పటికే ఆయన లుక్ను రివీల్ చేశారు. కానీ ఆయన చేతిలో ఉన్న ఆయుధం కొత్తగా ఆకర్షిస్తోంది.
‘గిప్పడి సంది ఖేల్ అలగ్’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ’ షైన్స్ర్కీన్ సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్ర్కీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుగా ఈ చిత్రం విడుదల కానుంది.