అధికారుల తక్కువ..కల్తీలు ఎక్కువ

కల్తీలకు కాదేదీ అనర్హం అన్నచందంగా జిల్లాలో కొందరు వ్యాపారులు చెలరేగుతున్నారు. ప్రతి వస్తువునూ కల్తీచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ వస్తువులను నియంత్రించాల్సిన ఫుడ్‌ కంట్రోల్‌ శాఖ అధికారులు సిబ్బంది కొరతతో సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫుడ్‌ కంట్రోలర్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉండటంతో వారు కల్తీలను నియంత్రించలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం గుంటూరులో కల్తీ కారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. పలు మిల్లులు, గోదాముల్లో భారీ స్థాయిలో కల్తీకారం, మిరపకాయల తొడేలతో చేసిన కారం పట్టుబడిరది. అప్పట్లో విజిలెన్స్‌, జిల్లాస్థాయి అధికారులు హడావుడి చేశారు. ప్రత్యేక బృందాలతో తనిఖీ చేసి శాంపిల్స్‌ను తీశారు. 97 శాంపిల్స్‌ తీయగా వాటికి సంబంధించి 16 కేసులు కోర్టులో నడుస్తున్నాయి. మరో 45 కేసులు జేసీ కోర్టులో ఉన్నాయి. 12 కేసులకు సంబంధించి అధికారులు జరిమానాలతో సరిపెట్టారు.కూరలో వేసే కారం నుంచి నూనె వరకు, నెయ్యి నుంచి టీపొడి వరకు, ఆఖరికి పాలు, పెరుగు, మిఠాయిలు, పండ్ల వరకు ప్రతి ఒక్కదానినీ కల్తీమయం చేస్తున్నారు. జిల్లాలో విజిలెన్స్‌ దాడుల్లో కల్తీ నెయ్యి, నూనెలు పలుమార్లు పట్టుబడ్డాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాము వాడుతున్న నూనెలు మంచివేనా అన్న అనుమానం వారిని పీడిస్తోంది. పండ్లు,టీపొడి, ఊరగాయలు, చికెన్‌, మటన్‌, ఇలా ప్రతి వస్తువులో కల్తీ జరుగుతోందని అధికారులు గుర్తిస్తున్నారు. దీంతో ప్రజలు ఏ వస్తువును కొనా లన్నా ఆందోళన చెందుతున్నారు. చివరకు హోటళ్లు, దాబాల్లో సైతం కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తుండటంతో ప్రజారో గ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లు, ప్రభుత్వ హాస్టళ్లకు కల్తీవస్తువులు సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు, హోటళ్లలో భోజనం చేసేవారు అనారోగ్యం పాలవుతున్నారు.. ఈ కల్తీ వ్యవహారంలో ఓ అధికారి పార్టీ నేత పంచాయితీలు జరిపి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని కేసును కోల్డ్‌స్టోరేజీలపైకి నెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. విజిలెన్స్‌, పోలీసు అధికారులు పట్టుకున్నప్పుడు హాజరై శాంపిల్స్‌ తీసి కేసులు నమోదు చేసేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. జిల్లాలో తీసిన శాంపిల్స్‌ నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం తెలంగాణకు పంపిస్తున్నారు. శాంపిల్స్‌ పరీక్షించి నివేదికలు వచ్చేం దుకు జాప్యం జరగడంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు అన్నిరకాల ఆహార పదార్థాల్లో 449 శాంపిల్స్‌ తీశారు. 97 శాంపిల్స్‌ సురక్షతం అని పరీక్షల్లో తేలాయి. వీటిలో 14 కేసులు నూనెలకుసంబంధించిన కేసులు ఉన్నాయి. 37అన్‌సేఫ్‌, 19 సబ్‌ స్టాండెడ్‌, 46 మిస్‌బ్రాండ్‌ వస్తువులుగా తేలాయి. వీటికి సంబంధించి కొన్ని కేసులు కోర్టులో నడుస్తుండగా, కొన్ని జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో పెండిరగ్‌లో ఉన్నాయి. గత జూలైలో మంగళగిరిలో పట్టుబడిన కల్తీ నెయ్యి, ఆదివారం గుంటూరులో పట్టుబడిన జంతు కొవ్వుల నూనె వ్యవహారం సంచలనం రేకెత్తించాయి. ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు నెలకు 30 నుంచి 40 శాంపిల్స్‌ తీయాల్సి ఉంది. అయితే ఈ శాంపిల్స్‌ తీసేందుకు వారికి వాహన సదుపాయం, సహాయ సిబ్బంది లేకపోవడంతోచట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *