జనసురాజ్‌ పేరుతో పొలిటికల్‌ ఇన్నింగ్స్‌

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సొంతంగా పొలిటికల్‌ పార్టీ ఏర్పాటు చేసే విషయంలో మరో అంశం హాట్‌ టాపిక్‌ గా మారింది. పీకే చెప్పిన పేరుతోనే ఓ రాజకీయ పార్టీ పేరు, దాని అధ్యక్షుడి వివరాలు ఈసీ వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారాయి. ‘జన్‌ సురాజ్‌’ పేరుతో పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తానని ఈ ఏడాది మే మొదటి వారంలో పీకే సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా బిహార్‌ లో పాదయాత్ర ప్రారంభిస్తానని, ఈ యాత్రలో ప్రజల మనోభీష్టం మేరకు అవసరమైతే రాజకీయ పార్టీని స్థాపిస్తానని పీకే ప్రకటించారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ఖరారు చేస్తూ పీకే జన్‌ సురాజ్‌ (సుపరిపాలన) ధ్యేయంగా జనంలోకే వెళుతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేయగా.. ఇదే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు ఓ అప్లికేషన్‌ వెళ్లడం ఆసక్తిగా మారింది.సీఎం నితీష్‌ కుమార్‌, మాజీ సీఎం లాలు ప్రసాద్‌ యాదవ్‌ లు బిహార్‌ ను వెనుకబడిన రాష్ట్రంగా మార్చేశారని పీకే విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రాబోయే దశాబ్దం కాలంలోనైనా బిహార్‌ ప్రగతిశీల రాష్ట్రంగా ఎదగాలంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో అది సాధ్యం కాదని, అందుకోసం కొత్త ఆలోచన, ప్రత్యామ్నాయ మార్గం అవసరం అని పదే పదే చెబుతున్నారు. తొలుత జన్‌ సురాజ్‌ పేరుతో పాదయత్ర చేస్తానని ,ఆ తర్వాత రాజకీయ పార్టీ స్థాపించబోతున్నామని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించినట్లుగానే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ‘జన్‌ సురాజ్‌’ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ అప్లికేషన్‌ వెళ్లింది. న్యూఢల్లీి కార్యాలయం పేరుతో ఎస్‌.కె మిశ్రా అధ్యక్షుడిగా, జనరల్‌ సెక్రెటరీగా బిజయ్‌ సాహో, ట్రెజరరీ గా అజిత్‌ సింగ్‌ పేర్లతో పార్టీ పేరును రిజిస్టర్‌ చేయబోతున్నామని, ఈ పేరుపై అభ్యంతరాలు ఉంటే నెల రోజుల లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియపరచాలని గత నెలలోనే పబ్లిక్‌ నోటీస్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.జన సురాజ్‌ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం అప్లికేషన్‌ రావడంతో ఈ పార్టీ ప్రశాంత్‌ కిశోర్‌ కు చెందినదే అనే చర్చ మొదలైంది. పబ్లిక్‌ నోటీసులో పార్టీకి సంబంధించిన వారిలో ఎక్కడా పీకే పేరు ప్రస్తావించబడలేదు. అధ్యక్షుడిగా ఉన్న ఎస్‌.కే మిశ్రా, జనరల్‌ సెక్రటరీ బిజయ్‌ సాహో ఇద్దరూ ఢల్లీికి చెందిన వారు కాగా.. ట్రెజరరీ అజిత్‌ సింగ్‌ మాత్రం బిహార్‌ కు చెందిన వాడు కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఒక వేళ పార్టీ పెడితే దానికి ప్రెసిడెంట్‌ గా ఉండబోయేది తాను కాదని పీకే గతంలోనే చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి జన్‌ సురాజ్‌ పేరుతో ఓ పార్టీ రిజిస్ట్రేషన్‌ కు వెళ్లడం, అందులో పీకే పేరు లేకుండా ఇద్దరు ఢల్లీికి చెందిన వారు ఉండగా.. బిహార్‌ కు చెందిన మరో వ్యక్తికి కీలకమైన బాధ్యత ఉండటం చూస్తుంటే ఈ పార్టీ వెనక ఉన్నది ప్రశాంత్‌ కిశోర్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే ప్రశాంత్‌ కిశోర్‌ భవిష్యత్‌ కార్యచరణను తెరవెనుక నుండి చక్కబెట్టుకునే పనిలో స్పీడ్‌ పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం దాదాపు ఖరారు అయినట్లే. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా వెల్లడిరచారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ప్రత్నామ్నాయ ఎజెండా అవసరం అని, అందుకు తమ అవసరం జాతీయ స్థాయిలో ఉందని కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నేతలతో పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం పీకే టీఆర్‌ఎస్‌ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించిన జన్‌ సురాజ్‌ పేరుతోనే కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు ఓ రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ కు వెళ్లడంతో ఈ ప్రయత్నం వెనుక కేసీఆర్‌ కూడా ఉన్నారా? అనే ఆసక్తికర చర్చ తెరవిూదకు వస్తోంది. అయితే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో పార్టీని పెడతారనే లీకులు రావడంతో పబ్లిక్‌ నోటీస్‌ ఇచ్చిన ‘జన్‌ సురాజ్‌’ కు కేసీఆర్‌ పెట్టబోయే పార్టీకి సంబంధం ఉందా? లేదారa అనేది హాట్‌ టాపిక్‌ గా మారింది. జరుగుతున్న ప్రచారం ప్రకారం జన్‌ సురాజ్‌ పార్టీకి కర్త, కర్మ, క్రియ అంతా పీకేనేనా లేక పబ్లిక్‌ నోటీసులో ప్రస్తావన లేనట్లుగానే ఈ పార్టీకి పీకే కు ఎలాంటి సంబంధమేమి లేదా? అనేది అక్టోబర్‌ 2వ తేదీన తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *