వైసీపీలో కాంతదాసులు…

ముఖ్యమంత్రి పీఠం కోసం వైయస్‌ జగన్‌.. సోనియాగాంధీని ఎదిరించాడు… ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పేరు తలగడంతో.. ఆయనని సంప్రదించాడు. అయితే ఈ కోర్సు చాలా చాలా కష్టంతో కూడుకున్నదని… ఆ క్రమంలో వేలకు వేల కిలోవిూటర్ల మేర పాదయాత్ర చేయాలి… ప్రజలకు ముద్దులు పెట్టాలి.. తలలు నిమరాలి.. తలపై చేతులు పెట్టాలి.. ఒక్కరు ఉన్నా…. వంద మంది ఉన్నా.. వేలా మంది ప్రజలు ఉన్నా.. చెప్పిందే చెప్పుకొంటూ పోవాలి.. అంటూ కండిషన్లు పెట్టడమే కాదు.. అందుకు కోర్సు సమయంతో పాటు వందల కోట్లలో ఫీజు సైతం వసూల్‌ చేశాడనే ఓ టాక్‌ 2019 ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీహార్‌ వరకు జోరుగానే వైరల్‌ అయింది.
ప్రతిపక్షనేత స్థానం నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు వైయస్‌ జగన్‌ పడిన కాయకష్టం తాలుక ఎపిసోడ్‌ ఒక ఎత్తు అయితే.. ఆ మహానేత కుమారుడు ఈ జననేత పడిన కష్టాన్ని ఆయన పార్టీలోని నేతలే గుర్తించడం లేదు సరికదా.. మరోసారి తమ అధినేత వైయస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఉండేందుకు.. ఎంత చేయాలో అంతా చేసేస్తున్నారు. ఇంకా క్లియర్‌ కట్‌గా చెప్పాలంటే.. వైయస్‌ జగన్‌ భవిష్యత్తుని దుంప నాశనం చేసేందుకు టాలీవుడ్‌ కమెడియన్‌ పృధ్దీ రాజ్‌, జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రి అవంతి శ్రీనివాస్‌, మలి కేబినెట్‌లో మంత్రి అంబటి రాంబాబు, తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఎక్సెట్రా ఎక్సెట్రా కంకణం కట్టుకొన్నారని వైసీపీ శ్రేణులే జోకులేసుకుంటున్నాయి.జగన్‌ అదికారంలోకి వచ్చిన తర్వాత టాలీవుడ్‌ నటుడు, థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృద్దీ రాజ్‌ ని శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పోస్ట్‌లో నియమించారు సీఎం జగన్‌. ఇలా తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకొని అలా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఈ ధర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీరాజ్‌ .. ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడుతున్న ఫోన్‌ కాల్‌కు సంబంధించిన ఆడియో అటు సోషల్‌ విూడియాలో ఇటు విూడియాలో లీక్‌ అయి వైరల్‌ అంది. అంతే ఆయన ఆ పదవికే గోవిందా గోవిందా అంటూ గంట కొట్టి మరీ మంగళహరతి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. మరోవైపు థర్టీ ఈయర్స్‌ ఇండస్ట్రీ పృధ్దీ మరికొద్ది కాలం ఈ చైర్మన్‌గిరిలో ఉంటే. ఈ భక్తి చానల్‌ కాస్తా రక్తి చానల్‌గా మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ఓ టాక్‌ తిరుపతిలోని ఆలిపిరి శ్రీవారి పాదాల సాక్షిగా గట్టిగానే వినిపించింది. ఇక ఆ తర్వాత సత్తెనపల్లి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు… నాడు ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడుతూ.. మసాజ్‌ అంటూ.. అర గంట.. గంట అంటూ మాట్లాడిన మాటలు సైతం రచ్చ రచ్చ చేసి వదిలాయి. కానీ రాంబాబు.. మహాగట్టివాడు.. ఇంకా చెప్పాలంటే.. గట్టిపిండం.. తన వాయిస్‌ కాదు.. ఎవరో మిమిక్రి చేశారంటూ తన మాటల గారిడీతో బుకాయించేశానే. ఆ తర్వాత సీఎం జగన్‌ కూడా ఇవేమి పట్టించుకోకుండా.. తన మలి కేబినెట్‌లో అంబటికి జలవనరుల శాఖ మంత్రిగా ప్రమోషన్‌ ఇచ్చేశారు. ఆ క్రమంలో అంటే అంబటి రాంబాబు ఆడియో లీక్‌ అయిన్‌ జస్ట్‌ వారం రోజులకే నాటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న.. అవంతి శ్రీనివాస్‌ రావు… ఓ మహిళతో మాట్లాడుతున్న ఆడియో లీక్‌ అయి.. రచ్చ రచ్చ చేసి పెట్టింది. కానీ ఆయన మంత్రి పదవికి ఎసరు రాలేదు.. అలాగే ఎమ్మెల్యే పదవి సైతం యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఉంది. ఇక తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌.. వీడియో కాల్‌ అయితే.. విూడియాలోనే కాదు.. సోషల్‌ విూడియాలో సైతం రచ్చ రంబోలా చేసి పోరేస్తోంది. దీనిపై ఇప్పటికే ఎంపీ గోరంట్ల.. ఇది ఫేక్‌ వీడియో.. తాను జిమ్‌ చేస్తున్న వీడియోను టీడీపీ వాళ్లు ఇలా మార్ఫింగ్‌ చేశారంటూ విూడియా ముందుకొచ్చి మరీ చెప్పారు. అంతేకాకుండా దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామని చెప్పారు.కానీ గోరంట్ల బాగోతం వీడియో సాక్షిగా లీక్‌ కావడంతో.. దీనిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్‌ భేటీ అయి.. చర్చించినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. అయితే సజ్జల విూడియా సాక్షిగా మాట్లాడుతూ.. గోరంట్ల వీడియో నిజమైతే.. ఆయనపై పార్టీ కచ్చితంగా చర్యలు తీసుకొంటుందంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు.. వైయస్‌ జగన్‌ పార్టీలో కాంతా దాసుల సంఖ్య భారీగా ఉందన్న ప్రచారం సోషల్‌ విూడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు.. జగన్‌ పార్టీకి ప్రతిపక్ష పార్టీల పోరు.. హోరు ఏమో కానీ.. సొంత పార్టీలోని రసిక రాజాల తాలుక పోన్‌ కాల్స్‌.. వీడియో కాల్స్‌తో గెలుపు ఆడ్రస్‌ గల్లంతు అయినా ఆశ్చర్య పడనక్కర్లేదని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *