జనసేన విషయంలో రూటు మార్చిన వైసీపీ నేతలు

ఇన్నాళ్లూ పవన్‌తో నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో దూకుడు చూపించిన వైసీపీ నేతలు ఎందుకో మరి కాస్త వెనక్కు తగ్గారు.. ఈ తగ్గడం వెనకున్న వ్యూహమేంంటో.. చంద్రబాబు వలలో చిక్కుకోవద్దంటూ పవన్‌కు సుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. ఇప్పుడే ఎన్నికల వేడిని తలిపిస్తున్నాయి.. రాజకీయాలు. ఏపీలోని పాలిటిక్స్‌లో పవన్‌ సెంటర్ పాయింట్‌ గా నిలిచారు.

దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని.. పవన్‌ కల్యాణ్‌ను వైసీపీ పొలిటికల్ ట్రాప్‌లో పడేసే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు జనసేన అధ్యక్షుడిపై వైసీపీ వ్యూహం మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. నిన్నటి వరకు పవన్‌ కల్యాణ్‌ను నేరుగా అటాక్‌ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడెందుకు రూటు మార్చడమే కాదు.. పవన్‌పై ఒంటికాలిపై లేచిన నేతలంతా ఎందుకు దూకుడు తగ్గించారని చెబుతున్నారు. అవును పవన్‌ విషయంలో వైసీపీ మంత్రులు, నేతలు కొంచెం వెనక్కి తగ్గినట్లే అనిపిస్తుంది తాజా పరిస్థితి చూస్తుంటే..

అయితే, ఇన్నాళ్లూ పవన్‌తో నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో దూకుడు చూపించిన వైసీపీ నేతలు ఎందుకో మరి కాస్త వెనక్కు తగ్గారు.. ఈ తగ్గడం వెనకున్న వ్యూహమేంంటో.. చంద్రబాబు వలలో చిక్కుకోవద్దంటూ పవన్‌కు సుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫేస్‌ టు ఫేస్‌ వెళ్లడం కంటే.. ఈ రూటే బెటరనుకున్నారేమో.. అందుకే దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది.

పవన్‌పై ఏదైనా కామెంట్‌ చేయాలన్నా, కౌంటర్‌ ఇవ్వాలన్నా ముందుండే ఫైర్‌ బ్రాండ్‌ రోజా.. చంద్రబాబు తన కొడుకు కోసం.. పవన్‌కల్యాణ్‌ను బలి చేస్తున్నారన్నారు మంత్రి రోజా. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకున్నట్లే పవన్‌ని వాడుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పవన్‌ను వాడుకుని వదిలేస్తున్నారని.. తోటి నటుడిని వాడుకుని వదిలేస్తుంటే తనకు బాధగా ఉందని చెప్పారు.

మరోవైపు జనసేన సైనికులకు పెద్దిరెడ్డి హితబోధ చేశారు. మంత్రి రోజా మాత్రమే కాదు.. ఆ వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జనసేన సైనికులకు హితబోధ చేశారు. జనసేన పార్టీకి ఓటు వేసేవారు ఇకనైనా ఆలోచించాలన్నారు. అంతేనా,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకోవాలన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి బంట్రోతుగా ఉండి ఆయన కిందపనిచేస్తూ ఉంటే జనసేన ఓటర్లు ఎలా జీర్ణించుకుంటారన్నారు.

మొత్తం మీద పవన్‌కల్యాణ్‌ను ఆటలో అరటిపండుగా వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబును దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఇది అధికారపార్టీకి ఎంత ప్లస్‌ అవుతుందో..ఎంత మైనస్‌ అవుతుందో చెప్పలేని పరిస్థితి.. కానీ పవన్‌ కల్యాణ్‌ను ట్రాప్‌ చేసే ప్రయత్నం మాత్రం పీక్స్‌లో ఉన్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *