పెద్దపల్లిలో కాలుష్య సుడిగండం

కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్‌ ఎఫ్‌ సి ఎల్‌, జెన్‌ కో సింగరేణిల కాలుష్యం బూడిద చెరువుల గుట్టలతో నింగి నేల నీరు జనాలను దెబ్బతిస్తున్నాయిఆర్‌ ఎఫ్‌ సి ఎల్‌ నుండి ఆమోనియా వ్యర్ధాలు ఎలాంటి ట్రీట్‌ మెంట్‌ లేకుండా గోదావరిని కాలుష్య గరళంగా మారుస్తున్నాయి. మరోవైవు ఫ్యాక్టరీ నుండి వెలువడే ఆమోనియా విష వాయువు రామగుండం వాసులకు కంటి విూద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు ఎన్టీపీసీ లో బొగ్గు కాల్చగా వెలువడే యాష్‌ కందనపల్లి గ్రామంలోని యాష్‌ చెరువుకు తరలిస్తారు అక్కడ నుండి వందల లారీల్లో రవాణా నేపథ్యంలో అనేక గ్రామాలు బూడిద మయంగా మారుతున్నాయి. ఇటు సింగరేణి కాలనీల నుండి వెలువడే వ్యర్థ జలాలు జనగామ చెరువు వద్ద గోదావరిలో కలుస్తాయి. అదే గోదావరి నుండి సింగరేణి కాలనీ లకు,పట్టణానికి త్రాగు నీరుగా అందిస్తున్నారు. కోల్డ్‌ బెల్ట్‌ ఏరియాలో ఓపెన్‌ కాస్టుల్లో బాంబుల మోత దుమ్ము ధూళి అంతా కలిసి రామగుండం ఏరియా కాలుష్య కోరల్లో చిక్కుకుంది.ఇంకోవైపు ఈ ప్రాంతాలలో నివసించే మనుషులు జీవిత కాలం కనీసం పదేళ్లు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ ఎముకల జబ్బులు, గుండె సంబంధిత రోగాలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోకుండా ఉండటం వల్లనే జల వాయు శబ్ద కాలుష్య నియంత్రణ చేయలేని స్థితికి రామగుండం చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రామగుండం ప్రాంతంలో మానవ మునుగడప్రశ్నర్థకంగా మారిందని అంటున్నారు. రామగుండంలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *