వైఎస్‌ ఫ్యామిలీ రాజకీయాల్లో… చీలిక

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా పవర్‌ ఫుల్‌ ఫ్యామిలీల్లో ఒకటి యెదుగూరి సందింటి కుటుంబం. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కుటుంబం అంతా ఏకతాటిపైన ఉండేది.కానీ ఆయన మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. కుటుంబంలో ఆధిపత్య పోరాటం క్రమంగా పెరిగి పెద్దదయింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య తో మరితం జఠిలం అయింది. వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యక్తిత్వంపై అవినాష్‌ రెడ్డి వర్గం నిందలు వేస్తూంటే… వాటిని షర్మిల ఖండిరచడం..సునీతకు అండగా నిలవడం సంచలనంగా మారింది. దీంతో వైఎస్‌ ఫ్యామిలీ రెండుగా విడిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో ఓ వర్గం ఏదైనా పార్టీ తరపున బరిలో నిలిస్తే రాజకీయగా ఎన్నో మార్పులు వస్తాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. ఆయన తల్లి విజయలక్ష్మి వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. జగన్‌తో ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. షర్మిల పార్టీకి అండగా ఉంటానని ప్లీనరీలోనే కన్నీటితో ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో షర్మిలకు అవసరం అయినప్పుడల్లా రోడ్డు విూదకు వస్తున్నారు. కానీ షర్మిలకు సీఎం జగన్‌ వైపు నుంచి ఎలాంటి మద్దతూ రావడం లేదు. ఇద్దరి మధ్య గ్యాప్‌ ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రాఖీ పండుగకు కూడా వారు కలుసుకోవడం లేదు. వైఎస్‌ సునీతతో పాటు షర్మిల కూడా జగన్‌ కు దూరమయ్యారు. అంటే కుటుంబంలోని సగం మంది జగన్‌ కు దూరమయ్యారన్న చర్చ జరుగుతోంది. భార్య భారతి తరపు బంధువులు మాత్రమే జగన్‌ వైపు ఉన్నారంటున్నారు. సోదరి షర్మిల జగన్‌ పై కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై కోపం ఉంటే.. ఏపీలో పార్టీ పెట్టుకోవాలి కానీ తెలంగాణలో ఎందుకని చాలా మంది ప్రశ్నించారు కూడా. కారణం ఏదైనా ఏపీలో రాజకీయం చేయడానికి షర్మిల సిద్ధంగా లేరు. తన బతుకు అంతా ఇక తెలంగాణనేనని ఆమె ప్రకటించారు. అయితే వంద శాతం దీన్ని కొట్టి వేయలేమని.. గతంలో బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ సమావేశాలు క్లారిటీ ఇచ్చారు. జగన్‌ పై అసంతృప్తితో ఆయన పలు సమావేశాలు నిర్వహించారు. సొంత పార్టీ పెడతారన్న ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఆయన సైలెంట్‌ అయ్యారు. మరో వైపు వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్‌ ఫ్యామిలీలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్‌ సునీత టీడీపీ తరపున పార్లమెంట్‌ బరిలో నిలుస్తారని పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే ఆమె న్యాయం కోసం చేస్తున్నపోరాటంపై రాజకీయ ముద్ర వేయడానికి కుట్ర పన్నారని టీడీపీ నేతేలు ఆరోపిస్తున్నారు. టీడీపీతో సునీత రాజకీయంగా ఎలాంటి చర్చలు జరపలేదంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమన్న అభిప్రాయం కడపలో జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ ఫ్యామిలీ వర్సెస్‌ వైఎస్‌ ఫ్యామిలీ అన్నట్లుగా పోరు ఉండవచ్చని వైసీపీ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. అందుకే బలమైన అభ్యర్థుల కోసం వైసీపీ నేతలు వెదుకుతున్నట్లుగా చెబుతున్నారు. కడప వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో అవినాష్‌ రెడ్డికి బదులుగా ఇతరులను బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఇతరులు బయట వ్యక్తులు కాదని.. వైఎస్‌ కుటుంబం లోని వారేనని అంటున్నారు. తల్లిని విజయలక్ష్మిని ఒప్పించి ఎంపీ సీటులో నిలబెడతారని.. లేదు జగన్‌ సతీమణి భారతి నిలబెడతారని కొందరు ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని ఇతర పేర్లూ ప్రచారంలోకి వస్తున్నాయి. మొత్తంగా వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు.. వైఎస్‌ ఫ్యామిలీలో చీలికలకు కారణం అవుతోంది. రాజకీయంగాను పెను?ర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *