ఉత్తరాంధ్రలో లోకల్‌ సెంటిమెంట్‌

విశాఖపట్టణం, అక్టోబరు 19
ఎన్నికలు ఎప్పుడొచ్చినా?. ఉత్తరాంధ్రలో ఒక స్లోగన్‌ మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. స్ధానిక నాయకత్వానికే పెద్దపీట వేయాలంటూ గొంతెత్తుతారు విద్యావంతులు. ముందైతే ఊపుగా చర్చోపచర్చలు జరుగుతాయిగానీ? తీరా ఎన్నికల తెర విూదికి వచ్చేసరికి అంతా సైలెంట్‌ అయిపోతారు. కానీ? తొలిసారిగా ఇదో రాజకీయ నినాదంగా మారబోవడమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్‌ విూద కొత్త డిబేట్‌ మొదలైంది. రాజధాని మార్పు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రకరకాల చర్చలు జరుగుతున్న టైంలో? అసలు విశాఖపట్టణంలో 90శాతం ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని, ప్రజాభిప్రాయసేకరణ చేస్తే నిజాలు బయటపడతాయని అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. దీనికి బొత్స స్పందించిన తీరు వైసీపీ భవిష్యత్‌ ఆలోచనల్ని ప్రతిబింబించేదిగా ఉందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.ఉమ్మడి రాష్ట్రంలో కీలక పదవులు నిర్వహించిన, సుదీర్ఘ అనుభవం వున్న నేత నోటి నుంచి స్థానికులు, స్థానికేతరులు అన్న మాటలు రావడం విూదే ఆసక్తికర చర్చ జరుగుతోంది. బయటి నుంచి వచ్చిన వాళ్ళకు ఉత్తరాంధ్ర వేదన, వెనుకబాటు తనం ఎలా అర్ధమవుతాయంటూ గట్టి వ్యాఖ్యలే చేశారు బొత్స. స్థానికేతర నాయకులు ఇక్కడ రాజకీయ అవసరాలు తీర్చుకుంటారే తప్ప? అభివృద్ధిని కోరుకోవడం లేదన్నది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఈ పాయింట్‌నే? 2024 ఎన్నికల అంశంగా మార్చుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి రాజకీయంగా? స్ధానిక నాయకత్వానికి దక్కాలిసిన గౌరవం దక్కడం లేదన్న భావన అన్ని పార్టీల్లోనూ అంతర్గతంగా వుంది. ఈ విషయాన్నే బొత్స కుండలు బద్దలు కొట్టేయడంలో ఈసారి ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయోనన్న ఆసక్తి పెరుగుతోంది.ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్‌ వేగా వున్న విశాఖలో 1990 వరకు స్థానికుల హవా నడిచింది. ఆ తరువాత క్రమంగా స్థానికేతర నేతలు పాగా వేయడం మొదలైంది. మూడు దశాబ్ధాలుగా ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఇతర ప్రాంతాలకు చెందినవారే ఎన్నికవుతూ వస్తున్నారు. వీళ్లు పార్టీలు మారుతున్నా, విశాఖను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఎంవీవీఎస్‌ మూర్తి, టి. సుబ్బిరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, హరిబాబు, ఎంవీవీ సత్యనారాయణ ఇలా? విశాఖ ఎంపీలుగా స్థానికేతరులే గెలుస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో వైసీపీ? లోకల్‌ `నాన్‌ లోకల్‌ నినాదాన్ని అందుకుంటే? పరిణామాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరమైన చర్చ.విశాఖపట్టణం ఎంపీ సీటు విషయంలో ఇటు వంటి ప్రయోగం చేయడం ద్వారా ప్రజల మనసుల్లో వున్న సెంటిమెంట్‌ను పండిరచాలన్న అభిప్రాయం పార్టీ సీనియర్స్‌లో కనిపిస్తోందట. ఆ దిశగా ఫ్యాన్‌ పార్టీ ఇప్పటికే వ్యూహాలను ఫ్యాన్‌ పార్టీ సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక, బీసీ అభ్యర్ధిని విశాఖ ఎంపీగా పోటీకి పెట్టడం ద్వారా?. ఒక్క దెబ్బకు రెండు పిట్టల వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. వైసీపీ వ్యూహంపై తమకు కూడా సమాచారం ఉందని టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా యాదవ లేదా మత్స్యకార, తూర్పు కాపుల్లో ఒకరికి చాన్స్‌ దక్కడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అధికారంలో వున్న రాజకీయ పార్టీగా వైసీపీ ఈ అంశానికి ప్రాముఖ్యత ఇస్తే పరిణామాలు వేగంగా మారే అవకాశం వుంటుంది.వ్యాపారాల కోసం వచ్చి స్థిపరడి ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్న తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల తీరుపై చర్చ జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ ఎఫెక్ట్‌ పడుతుందన్నది విశ్లేషకుల మాట. ఉమ్మడి విశాఖజిల్లాలో 15 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్ధానాలు వున్నాయి. ఇందులో విశాఖ ఎంపీ, భీమిలి,పాయకరావుపేట ఎమ్మెల్యేలు మాత్రమే స్ధానికేతరులు. అదే లిస్ట్‌ని టీడీపీ నుంచి చూస్తే? హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే లు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామక్రష్ణ్రబాబు వున్నారు. పోటీ కోసం సిద్ధం అవుతున్న వాళ్ళలో మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు నాన్‌ లోకల్‌ లీడర్లే. ఎట్నుంచి ఎటు చూసినా? తమకంటే ప్రతిపక్షానికి నష్టం ఎక్కువ గనుక పార్టీలకు అతీతంగా ఒక స్లోగన్‌ తీసుకుని ఎన్నికల నాటికి ప్రజల్లో చర్చ పెట్టేలా వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే బొత్స లోకల్‌`నాన్‌ లోకల్‌ నినాదాన్ని అందుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఎన్నికల నాటికి ఈ నినాదం ఊపందుకుంటే? ఉత్తరాంధ్ర రాజకీయ లెక్కలు ఎలా మారతాయో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *