ఎత్తుకెళ్లి పోవాలా నా సామిరంగా

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగా’. అశికా రంగనాథ్‌ కథానాయిక. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తుది దశ చిత్రీకరణ జరుగుతోంది. ‘నా సామిరంగా’ చిత్రం నుంచి తొలిగీతం ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తోంది’ త్వరలో విడుదలవనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో రైతు గెటప్‌లో నాగార్జున ఆకట్టుకున్నారు. పొలంలో ట్రాక్టర్‌పై కాలు ఉంచి బీడీ కాలుస్తూ సరికొత్త లుక్‌లో కనిపించారు. ప్రసన్నకుమార్‌ ఈ చిత్రానికి […]

‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే..?

పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) పక్కనే ఉండే కేశవ (Keshava) పాత్ర పోషించిన నటుడు జగదీశ్.. ఒక మహిళ ఆత్మహత్య కేసులో అరెస్టయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఓ మహిళకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొద్దిరోజుల తర్వాత విడాకులు తీసుకుని నగరానికి వచ్చింది. సోమాజిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. సినీ పరిశ్రమలో ఆర్టిస్టుగా, చిన్న చిన్న డాక్యుమెంట్లు తీస్తున్న క్రమంలో ఆమెకు జగదీశ్(31)తో పరిచయం ఏర్పడింది. […]

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల విధ్వంసం

మావోయిస్టు పార్టీ 23వ పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా మంగళవారం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం(Dummugudem) మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. పొటకపల్లి-పాలోడి, పొటకపల్లి-దుబ్బమరక ప్రధాన రహదారులపై నాలుగు చోట్ల రోడ్డును తవ్వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా మంగళవారం దుమ్ముగూడెం మండల సరిహద్దు కిష్టారం వారాంతపు సంతకు వెళ్లే వ్యాపారులు ఎప్పటిలానే వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా రాత్రి 7.30కు భద్రాచలం-చర్ల సర్వీసును ఆర్టీసీ అధికారులు రద్దు […]

దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. ఈ సారైనా ఆ లోటు తీరుతుందా?..

చూస్తుండగానే సౌతాఫ్రికా పర్యటన వచ్చేసింది. ఈ నెల 10 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో సఫారీలతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్టు సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. సౌతాఫ్రికా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు విమనాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు వారితో సెల్ఫీలు […]

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లోని నెవాడా యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో (UNLV) బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు తెగబడిన నిందితుడు కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. […]

సెంటిమెంట్‌ ఫాలో కానీ ఇద్దరు నేతలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 అంకెల్లో దేని ప్రత్యేకత దానిదే.. రాజకీయాల్లో అందుకే ఒకటి ప్లస్‌ ఒకటి.. ఎప్పుడూ పదకొండు కాదు అని చెబుతుంటారు. ఇక అంకెల్లో 6 నంబరుకు ఉన్న ప్రత్యేకత వేరే. దీనిని తిరగేస్తే 9 అవుతుంది. అంటే.. అత్యధికులు లక్కీ నంబరుగా భావించే సంఖ్య వస్తుంది. వాస్తవానికి ఇదంతా నమ్మకాల ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా ఇదే నంబరు లక్కీ అని ఎవరికి ఎవరూ చెప్పలేరు. అయితే, కొంతమంది మాత్రం తమకు నచ్చిన, అచ్చొచ్చిన నంబరును […]

కమలం… ఆచితూచి అడుగులు

కరీంనగర్‌, డిసెంబర్‌ 7 కాంగ్రెస్‌ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి? ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులు బలంగా చెప్పగలిగితే పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కమల వికాసం తథ్యమని అందరూ అనుకున్నారు. బిజెపి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ 8 సీట్లతోనే […]

స్పీకర్‌ వద్దంటున్న సీనియర్లు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 తెలంగాణ సీఎం ఎవరనేది తేలిపోయింది.. మంత్రులు కూడా దాదాపు ఖరారయ్యారు. అయితే, మంత్రుల కంటే ముందు స్పీకర్‌ ఎవరు అనేది తేలాల్సి ఉంది. స్పీకర్‌ పదవి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదట కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్లు. సీనియర్‌ నేతలంతా తమకు స్పీకర్‌ పదవి వద్దంటే వద్దు అని దూరం జరుగుతున్నారట. స్పీకర్‌గా పని చేస్తే మళ్లీ గెలవరనే ఒక విశ్వాసం రాజకీయ నేతల్లో గాఢంగా ఉంది. గతంలో స్పీకర్‌గా పని చేసిన […]

అసెంబ్లీలో అగ్రకులాలదే పెత్తనం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7, 119మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలోకి ఈ సారి 43మంది రెడ్డి కులానికి చెందిన వారే అడుగుపెట్టనున్నారు. 13 మంది వెలమలు, నలుగురు కమ్మలు, బ్రాహ్మణ, వైశ్య కులాల నుంచి ఒక్కొక్కరు అసెంబ్లీలో అడుగుపెడతారు. అటు బీసీల ఎమ్మెల్యేల సంఖ్య 19గా ఉంది.తెలంగాణ, ఏపీ రాజకీయాలను కులాలను వేరు చేసి చూడలేం. కులసవిూకరణలు, లెక్కలు లేకుండా ఎన్నికలు జరగవు. ఎస్సీ, ఎస్టీలకు ఫిక్సడ్‌ సీట్లు ఉంటాయి.. మిగిలిన కులాల వారికి ఉండవు. ఎవరైనా […]

ఐటీ మంత్రిపై చర్చోపచర్చలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 తెలంగాణ ఐటీ మినిస్టర్‌ ఎవరు అన్నదానిపై సోషల్‌ విూడియాలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం కేటీఆర్‌ బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ అని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ విూడియాలో ట్రెండిరగ్‌ చేయడమే. అయితే కేటీఆర్‌ మాత్రమే కాదని ఆయనకు మించిన బెస్ట్‌ ఐటీ మినిస్టర్లు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉంటారని కాంగ్రెస్‌ మద్దతుదారులు సోషల్‌ విూడియాలో చర్చ పెడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో వీరు అర్హులు అంటూ కొంత మంది పేర్లను తెరపైకి తెచ్చి […]